Telangana: 50 వేల మెజార్టీకీ ఒక్క ఓటు తగ్గినా.. రాజకీయాలు వదిలేస్తా: ఉత్తమ్

కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజూర్‌నగర్‌లో తాను 50 వేల మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. 50 వేల మెజార్టీకి ఒక్క ఓటు తగ్గినా కూడా రాజకీయాల నుంచి తప్పుకుంటానని పేర్కొన్నారు. అలాగే కాంగ్రెస్‌లో చేరిన వారికి సముచిత స్థానాలు కల్పిస్తామని తెలిపారు. అందరూ సమన్వయంతో పనిచేసి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు.

New Update
Bilkis Bano Case: బిల్కిస్ బానో కేసులో సుప్రీం తీర్పు బీజేపీకి చెంపపెట్టు: ఉత్తమ్

మరో నెలరోజుల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అధికార, విపక్ష పార్టీలు ప్రచారాల జోరు పెంచేశాయి. ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ 115 నియోజకవర్గాలకు తమ అభ్యర్థులను ప్రకటించారు. బీజేపీ కూడా 52 మంది అభ్యర్థులతో మొదటి జాబితాను విడుదల చేసింది. ఇప్పటికే మొదటి జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్.. రెండో జాబితాను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ఇదిలా ఉండగా.. హూజూర్‌నగర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పోటీలోకి దిగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికలపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజూర్‌నగర్‌లో తాను 50 వేల మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.

Also read: కేసీఆర్‌కు షాక్‌.. సీఎంపై పోటీకి 120మంది..!

50 వేల మెజార్టీకి ఒక్క ఓటు తగ్గినా కూడా రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో కొందరు బీఆర్ఎస్ నేతలు మంగళవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్లో చేరిన వారికి సముచిత స్థానాలు కల్పిస్తామని వ్యాఖ్యానించారు. సమన్వయంతో కలిసి పనిచేసి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఇక తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే 6 గ్యారెంటీ హామీలను అమలు చేస్తామని తెలిపారు.

Also Read: కామారెడ్డిలో సీఎం కేసీఆర్ పై పోటీ.. షబ్బీర్ అలీ సంచలన ప్రకటన

Advertisment
Advertisment
తాజా కథనాలు