AP News : ఏపీలో కాంగ్రెస్ పార్టీ లోకసభ జాబితా విడుదల..9 మంది అభ్యర్థులు వీరే.!

ఏపీలో కాంగ్రెస్ పార్టీ లోకసభ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఏపీలో 9 మంది, జార్ఖండ్ కు చెందిన ఇద్దరు అభ్యర్థులతో కలిపి మొత్తం 11 మంది కూడిన లిస్టును ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆదివారం విడుదల చేశారు.

New Update
AP Congress: కాంగ్రెస్ సంచలన నిర్ణయం.. అభ్యర్థుల మార్పు!

Congress Party : ఏపీ(Andhra Pradesh) లో కాంగ్రెస్ పార్టీ లోకసభ(Lok Sabha) అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఏపీలో 9 మంది, జార్ఖండ్ కు చెందిన ఇద్దరు అభ్యర్థులతో కలిపి మొత్తం 11 మంది కూడిన లిస్టును ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్(KC Venu Gopal) ఆదివారం విడుదల చేశారు. ఏపీకి సంబంధించిన తొలి జాబితాలో 6, రెండో జాబితాలో 5స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే.

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా ఇదే:

-శ్రీకాకుళం - పి. పరమేశ్వరరావు

-విజయనగరం - బొబ్బిలి శ్రీను

-అమలాపురం - జంగా గౌతమ్

-మచిలీపట్నం -గొల్లు క్రుష్ణ

-విజయవాడ -వల్లూర్ భార్గవ్

-ఒంగోలు - ఈద సుధాకర్ రెడ్డి

- నంద్యాల - జె. లక్ష్మీ నరసింహ యాదవ్

-అనంతపురం -మల్లిఖార్జున్ వజ్జల

- హిందూపురం -బీఏ సమద్ షహీన్

ఇది కూడా చదవండి:  సీఎం జగన్‌తో ఆస్తిగొడవలపై షర్మిల కీలక వ్యాఖ్యలు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Heavy Rains: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు. ఆ జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌

తెలంగాణవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్, మెదక్ తదితర జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. అలాగే ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

New Update

తెలంగాణవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. క్యుములోనింబస్‌ మేఘాల కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌తో పాటు మెదక్, సంగారెడ్డి, సిద్ధిపేట, కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్, మెదక్, వికారాబాద్,  మహబూబ్‌నగర్‌, నారాయణపేట జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. 

Also Read: తెలంగాణలో భారీ వర్షాలు.. పిడుగుపాటుకు ఇద్దరు మృతి!

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి కృష్ణా, అనంతపురం, కడప, ప్రకాశం జిల్లాల్లో జల్లులు కురుస్తున్నాయి. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలాఉండగా గంటసేపు వర్షంతో హైదరాబాద్ రోడ్లనీ చెరువులను తలపిస్తున్నాయి. పలు చోట్ల ఈదురుగాలులతో చెట్లు విరిగిపడ్డాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి మరో మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్  జారీ చేసింది. 

Also Read: భూవివాదంలో సుప్రీం కోర్టు సీరియస్.. ‘ఏం జరిగినా పూర్తి బాధ్యత CS’

 

Advertisment
Advertisment
Advertisment