Rahul Gandhi : రాజ్యాంగంతో పాటు రిజర్వేషన్లు కూడా రద్దు.. మోదీపై రాహుల్ గాంధీ ఫైర్

రాజ్యాంగంతో పాటు రిజర్వేషన్లు కూడా రద్దు చేయాలని బీజేపీ కుట్ర చేస్తోందని అన్నారు రాహుల్. మోదీ గత పదేళ్లుగా దేశ సంపదనంతా అంబానీ, అదానీల చేతిలో పెట్టారని విమర్శించారు. వారికి మోదీ రూ.16 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేశారని పేర్కొన్నారు.

New Update
Rahul Gandhi : ఎన్నో భావోద్వేగాల మధ్య వాయనాడ్‌ను వీడుతున్నా..!

Constitution : రాజ్యాంగంతో పాటు రిజర్వేషన్లు(Reservation) కూడా రద్దు చేయాలని బీజేపీ(BJP) కుట్ర చేస్తోందని ఆరోపించారు కాంగ్రెస్(Congress) అగ్రనేత, ఎంపీ రాహుల్‌ గాంధీ(Rahul Gandhi). రిజర్వేషన్లను రద్దు చేసేందుకే ప్రభుత్వరంగ సంస్థలను విక్రయిస్తున్నారని మండిపడ్డారు. మోదీ గత పదేళ్లుగా దేశ సంపదనంతా అంబానీ, అదానీల చేతిలో పెట్టారని విమర్శించారు. రాజ్యాంగాన్ని మారుస్తామని బీజేపీ నేతలు చెప్తున్నారని.. అంబానీ, అదానీ వంటి వారికి మోదీ రూ.16 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేశారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ప్రతి రాష్ట్రంలోని పేదల వివరాలు సేకరిస్తుందని చెప్పారు. కాంగ్రెస్ అంటేనే పేదల ప్రభుత్వం అని అన్నారు.

Also Read : హైదరాబాద్ గడ్డపై మోడీ దుమ్ములేపే స్పీచ్-LIVE

Advertisment
Advertisment
తాజా కథనాలు