CM Revanth Reddy: కొత్త రేషన్ కార్డులపై సీఎం రేవంత్ నిర్ణయం..!

తెలంగాణలో వచ్చే కేబినేట్‌ మీటింగ్‌లో కొత్త రేషన్‌ కార్డులపై రేవంత్ సర్కార్‌ చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీటి కోసం లక్షలాది కుటుంబాలు వెయిటింగ్ లిస్టులో ఉన్నందున దీనిపై ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

New Update
CM Revanth Reddy: కొత్త రేషన్ కార్డులపై సీఎం రేవంత్ నిర్ణయం..!

New Ration Cards in Telangana: రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులపై రేవంత్ సర్కార్ దృష్టి సారించింది. వచ్చే కేబినేట్‌లో కొత్త రేషన్ కార్టుల అంశంపై చర్చించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పథకాలకు రేషన్‌ కార్డులే ప్రామాణికం అన్న విషయం తెలిసిందే. అందుకే కొత్త రేషన్ కార్డుల కోసం లక్షలాది కుటుంబాలు వెయిటింగ్ లిస్టులో ఉన్నాయి. కుటుంబ సభ్యుల పేర్లు చేర్చేందుకు ఎంతోమంది ఎదురుచూస్తున్నారు. అయితే కొత్త రేషన్‌ కార్డులకు ఎలా దరఖాస్తు చేసుకోవాలని అనేది ప్రశ్నార్థకంగా మారింది.

Also Read: థేమ్స్ రివర్ ప్రాజెక్టు తరహాలో మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు..!!

అయితే వచ్చే కేబినేట్‌లో దీనిపై రేవంత్ సర్కార్ ఓ నిర్ణయానికి రానున్నట్లు తెలుస్తోంది. కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడం ఎలా ?. మీ సేవాల ద్వారా అప్లికేషన్ తీసుకోవాలా ?. కొత్త కుటుంబ సభ్యుల్ని రేషన్ కార్డులో చేర్చడం ఎలా అనే దానిపై కేబినేట్ మీటింగ్‌లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఇదిలాఉండగా.. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో రేషన్‌కార్డుల కోసం భారీగా దరఖాస్తులు వచ్చాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు