congress government:పేదలకు ఇళ్ళ పంపకాలపై ఫోకస్..ధరణి పేరులో మార్పు?

పేదలకు ఇళ్ల కేటాయింపుపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చేలా కార్యాచరణకు దిగింది.దీని మీద గృహనిర్మాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు.

New Update
congress government:పేదలకు ఇళ్ళ పంపకాలపై ఫోకస్..ధరణి పేరులో మార్పు?

తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ స్థాపించిన దగ్గర నుంచీ వరుసపెట్టి ఆరు గ్యారెంటీలను అమలు చేయడమే కాక ఇళ్ళ కేటాయింపు, రైతు బంధు పంపిణీ లాంటి విషయాల మీద కూడా ఫోకస్ పెట్టింది. వీటి మీద సీఎం రేవంత్ రెడ్డితో పాటూ గృహ నిర్మాణ మంత్రి పొంగులేటి కూడా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇళ్ళ నిర్మాణానికి 3, 4 నమూనాలు సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. గృహ నిర్మాణ సంస్థ పునరుద్ధరణ చేయాలని చెప్పారు. ప్రస్తుతం గృహనిర్మాణ శాఖ..రోడ్లు, భవనాల శాఖలో భాగంగా ఉంది. దీన్ని వేరేగా ఒక శాఖ చేయాలా అన్న దాని మీద కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు దీని కోసం ఇతర శాఖల నుంచి సిబ్బందిని తీసుకోవాలని కూడా నిర్ణయం తీసుకుంది. ఇందిరమ్మ ఇళ్లపై త్వరలోనే సీఎం రేవంత్‌ సమీక్ష నిర్వహించనున్నారని సీఎం కార్యాలయం చెప్పింది. సీఎం సమీక్ష తర్వాత ఇండ్ల నిర్మాణానికి విధివిధానాలు ఖరారు చేయనున్నారు.

Also Read:పోలీసుల అదుపులో మహదేవ్ యాప్ ఓనర్

మరోవైపు తెలంగాణలో రైతుబంధు పంపిణీ కొనసాగుతోంది. సోమవారం నుంచి నిధుల జమ మొదలైంది. మొదటగా ఎకరాలోపు భూమున్న రైతుల ఖాతాల్లో డబ్బుల జమ చేస్తున్నారు. ఇప్పటిదాకా 22లక్షల మంది రైతుల అకౌంట్లలో రూ.640కోట్ల జమ అయిందని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. ఈసారికి పాత పద్ధతిలోనే రైతుబంధును జమ చేస్తున్నామని తెలిపింది. ఒకటిరెండు రోజుల్లో రైతుబంధుపై సర్క్యులర్ విడుదల చేస్తామని చెప్పింది. అది వచ్చాక కొత్తవారికి స్కీం వర్తింపు ఉంటుందని వివరించింది.

ఇక ధరణి పోర్టల్‌పై కాసేపట్లో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. దీనికి మంత్రి పొంగులేటి, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. ధరణి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కమిటీ వేసే ఆలోచనలో ఉందని సమాచారం. ధరణిలో పెద్దఎత్తున అవకతవకలు జరిగాయని అందుకే దాని స్థానంలో కొత్త పోర్టల్ తెస్తామని కాంగ్రెస్ చెబుతోంది. కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ధరణి పోర్టల్‌లో మార్పులు చేస్తామని తెలిపింది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Kitchen Tips: ఈ వేసవిలో మీ వంటగదిలో ఇవి తప్పనిసరిగా ఉండాలి

వేసవిలో శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడం అవసరం. వేడి, ఆహారం, చల్లనీరు ద్వారా వ్యాధులు వస్తాయి. ముఖ్యంగా ఫ్రిజ్‌లో ఉల్లిపాయలు, వెల్లుల్లి, బంగాళదుంపలు, వంటివి నిల్వ చేయవద్దు. వీటిని వెంటిలేషన్ ఉన్న ప్రదేశంలో నిల్వ చేయాలని నిపుణులు చెబుతున్నారు.

New Update
Kitchen Tips

Kitchen Tips

Kitchen Tips: వేసవిలో వేడి కారణంగా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంటుంది. వంట గదిలో ఉండేవారి పరిస్థితి అయితే దారుణం. కాబట్టి వేసవిలో వంటగదిలో ఉంచుకోవాల్సిన కొన్ని వస్తువులు ఉన్నాయి. వేడిగా, మురికిగా ఉన్న వంటగది తెగుళ్లు, క్రిములను ఆహ్వానించి ఆహార భద్రతను ప్రమాదంలో పడేస్తుంది. అందుకే ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ మనలో చాలా మంది శ్రద్ధ వహించాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. వేసవిలో శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడం చాలా అవసరం. అలాగే తాగడానికి శుభ్రమైన నీరు తీసుకోవడం చాలా ముఖ్యం. వేడి వల్ల ఆహారం ద్వారా, నీటి ద్వారా వ్యాధులు వస్తాయి. కాబట్టి వాటర్‌ ప్యూరిఫైయర్‌ను సరిగ్గా శుభ్రం చేయడం తప్పనిసరి.  తాగడానికి, వంట చేయడానికి లేదా ఉత్పత్తులను కడగడానికి శుభ్రమైన నీటిని మాత్రమే వాడండి.

ఆరోగ్యానికి అంత మంచిది కాదు:

మనలో చాలా మంది ఎండలోంచి వచ్చినప్పుడు చల్లటి నీరు తాగుతాం. దానికోసం చాలా మంది ఫ్రిజ్‌పై ఆధారపడతారు. కానీ ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఈ సమయంలో చల్లటి నీరు తాగడానికి మట్టి పాత్రలను ఉపయోగించడం ఉత్తమం. వేసవిలో వంటగదిలో వాసన ఎక్కువగా వస్తుంటుంది. ఇది అన్ని రకాల తెగుళ్లను ఆకర్షించడమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. బొద్దింకలు, ఈగలు, చీమలు వెచ్చని, తేమతో కూడిన ప్రదేశాలలో వృద్ధి చెందే అవకాశం ఉంది. అందువల్ల ఎక్కువ హానికరం కాని సహజ పురుగుమందులను వాడాలి. అధిక వేడి వల్ల కొన్ని కూరగాయలు సాధారణం కంటే త్వరగా చెడిపోతాయి. 

ఇది కూడా చదవండి: టాయిలెట్లలో డ్యూయల్‌ ఫ్లష్‌లు ఎందుకు ఉంటాయి?

ముఖ్యంగా మనం ఫ్రిజ్ బయట ఉంచే ఉల్లిపాయలు, వెల్లుల్లి, బంగాళాదుంపలు వంటివి. సరిగ్గా నిల్వ చేయకపోతే అవి బూజు పట్టి కుళ్ళిపోయి మొలకెత్తుతాయి. బంగాళాదుంపలు, ఉల్లిపాయలను కలిపి నిల్వ చేయవద్దు. అవి త్వరగా చెడిపోయేలా చేసే వాయువులను విడుదల చేస్తాయి. ఎక్కువ కాలం చెడిపోకుండా ఉండటానికి బాగా వెంటిలేషన్ ఉన్న ప్రదేశంలో నిల్వ చేయండి. ఊరగాయలు తేమగా ఉండటం వల్ల అవి చాలా సున్నితంగా ఉంటాయి. శుభ్రమైన, గాలి చొరబడని గాజు పాత్రలను ఉపయోగించండి. దీంతో అవి ఎక్కువ కాలం సురక్షితంగా, పాడవకుండా ఉంటాయి. మెటల్ మూతలు వాడకూడదు. ఎప్పుడూ కంటైనర్లను పూర్తిగా ఆరబెట్టాలని నిపుణులు అంటున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: తిరుమల ఘాట్ రోడ్డులో బోల్తా పడ్డ సుమో.. స్పాట్లో ఏడుగురు!

( kitchen-tips | easy-kitchen-tips | health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news )

Advertisment
Advertisment
Advertisment