Viral Video: బైక్‌ తీయబోయిన వ్యక్తికి గుండె ఆగినంత పనైంది

యూపీలో రోడ్డు పక్కన పార్క్ చేసి బైక్‌లో ఓ పెద్ద నాగుపాము హాయిగా కూర్చింది. ఈ భయానక వీడియోను ఓ జర్నలిస్ట్ వీడియో తీసి షేర్‌ చేయడంతో వైరల్‌గా మారింది. స్నేక్‌ క్యాచర్‌ ఒక వాటర్‌ క్యాన్‌లో చాకచక్యంగా బంధించి తీసుకెళ్లడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

New Update
Viral Video: బైక్‌ తీయబోయిన వ్యక్తికి గుండె ఆగినంత పనైంది

Cobra Sat On Bike: ఉత్తరప్రదేశ్‌లో ఓ యువకుడు తన బైక్‌ను రోడ్డు పక్కన పార్క్ చేసి తర్వాత వచ్చి చూసేసరికి షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది. ఒక పెద్ద పాము తన బైక్‌పై హాయిగా కూర్చుంది. పాము బైక్ పెట్రోల్‌ ట్యాంక్‌పై ఉండటంతో గమనించిన యువకుడు స్నేక్‌ క్యాచర్‌కు సమాచారం ఇచ్చాడు.ఈ భయానక వీడియోను ఒక జర్నలిస్ట్ వీడియో తీసి షేర్‌ చేయడంతో వైరల్‌గా మారింది.

యూపీలోని గాంధీనగర్‌లోని ఛతోహ్‌ రోడ్డులో ఈ ఘటన జరిగింది. చీకటిగా ఉండటంలో స్థానికులు కర్రలతో పామును కొట్టేందుకు సిద్ధమయ్యారు. ఇలాంటి ఘటన ఇదే మొదటిసారి కాదు. 2021లో IFS అధికారి సుశాంత నందా స్కూటర్ హెడ్‌లైట్ల వెనుక దాక్కున్న పాము వీడియోను షేర్ చేశారు.

ఆ వీడియోలో స్కూటర్ నెంబర్‌ ఆధారంగా అది తెలంగాణకు చెందినదిగా అనుకుంటున్నారు. స్కూటర్‌ ఓనర్‌ పామును గమనించి స్నేక్‌ క్యాచర్‌కు సమాచారం ఇచ్చాడు. స్నేక్‌ క్యాచర్‌ హెడ్‌లైట్‌లో చూస్తే పాము ఒక్కసారిగా బుసలు కొడుతూ బయటికి వచ్చింది. దానిని ఆ వ్యక్తి ఒక వాటర్‌ క్యాన్‌లో చాకచక్యంగా బంధించి తీసుకెళ్లడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

publive-image

అయితే.. ఇదంతా చూసిన నిపుణులు మాత్రం పాములు కనిపిస్తే వాటిని కొట్టడానికి ప్రయత్నించకుండా స్నేక్‌ క్యాచర్లకు సమాచారం ఇవ్వాలని అంటున్నారు. వర్షాకాలంలో బైక్‌లు, కార్లు తీసేప్పుడు ఒకటికి రెండుసార్లు చెక్‌ చేసుకోవాలని సలహా ఇస్తున్నారు. పాములను చంపడం భారతదేశంలో చట్టవిరుద్ధమని గమనించాలని అంటున్నారు.

ఇది కూడా చదవండి: వామ్మో.. స్ట్రాబెర్రీని మైక్రోస్కోప్‌లో చూస్తే అస్సలు తినరు

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.

Advertisment
Advertisment
తాజా కథనాలు