Telangana Jobs: యువతకు సీఎం రేవంత్ అదిరిపోయే శుభవార్త.. కొత్తగా 30,750 జాబ్స్!

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అమెరికా పర్యటన విజయవంతంగా ముగిసింది. సీఎం రేవంత్ తో చర్చల అనంతరం రాష్ట్రంలో 19 కంపెనీలు రూ.31,532 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించాయి. దీంతో యువతకు 30,750 ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని ప్రభుత్వం ప్రకటించింది.

New Update
Telangana Jobs: యువతకు సీఎం రేవంత్ అదిరిపోయే శుభవార్త.. కొత్తగా 30,750 జాబ్స్!

CM Revanth Reddy America Tour: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అమెరికా పర్యటన విజయవంతంగా ముగిసింది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు వివిధ రంగాల్లో ప్రపంచంలో పేరొందిన భారీ కంపెనీలు ముందుకు వచ్చాయి. ఈ పర్యటనలో 31,532 కోట్ల రూపాయల పెట్టుబడులను సాధించి తెలంగాణ పెట్టుబడుల గమ్యస్థానంగా అమెరికాలోని పారిశ్రామికవేత్తల దృష్టిలో నిలిచింది.

ఈ క్రమంలో అమెరికా వేదికగా రేవంత్ రెడ్డి తెలంగాణను ఫ్యూచర్ స్టేట్‌గా (Future State) ప్రకటించటం, హైదరాబాద్ 4.0 సిటీగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్న వివిధ ప్రాజెక్టులకు భారీ స్పందన వచ్చింది. దీంతో దాదాపు 19 కంపెనీలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకు వచ్చి ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. దీంతో రాష్ట్రంలోని యువతకు 30, 750 కొత్త ఉద్యోగాలు రానున్నాయి.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , మంత్రి శ్రీధర్ బాబు (Sridhar Babu) తో కలిసి ప్రభుత్వ అధికారుల బృందం ఈ నెల 3వ తేదీన అమెరికా పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి సారథ్యంలోని రాష్ట్ర ప్రతినిధి బృందం అమెరికాలో దాదాపు యాభైకి పైగా బిజినెస్ మీటింగ్, మూడు రౌండ్ మీటింగ్లలో పాల్గొంది. ప్రధానంగా అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రిక్ వాహనాలు, డేటా సెంటర్లు, ఐటీ ఎలక్ట్రానిక్ రంగాల్లో ప్రభుత్వంతో భాగస్వామ్యం పంచుకునేందుకు కంపెనీలు అమితమైన ఆసక్తిని ప్రదర్శించాయి.

Also Read: 10 రోజులు దాటింది.. మేఘా కంపెనీపై ఇంకెప్పుడు చర్యలు తీసుకుంటారు : కేటీఆర్‌

ఈ పర్యటనలో ప్రపంచంలో పేరొందిన కాగ్నిజెంట్, చార్లెస్ స్క్వాబ్, ఆర్సీసియం కార్నింగ్‌, ఆమ్జెన్, జొయిటిస్, హెచ్సీఏ హెల్త్ కేర్, వివింట్ ఫార్మా, థర్మో ఫిసర్, ఆరమ్ ఈక్విటీ, ట్రైజిన్ టెక్నాలజీస్, మోనార్క్ ట్రాక్టర్ కంపెనీలు రాష్ట్రంలో విస్తరణకు, కొత్త కేంద్రాలు నెలకొల్పేందుకు తమ సంసిద్ధతను వ్యక్తం చేశాయి.

వీటితో పాటు హైదరాబాద్‌లో తమ డేటా సెంటర్ విస్తరణకు అమెజాన్ సంస్థ తీసుకున్న నిర్ణయం ఈ పర్యటనలో చెప్పకోదగ్గ విశేషం. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి బృందం ఈ పర్యటనలో యాపిల్, గూగుల్, స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలతో, ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతోనూ చర్చలు జరిపింది.

దక్షిణ కొరియాకు రేవంత్‌ రెడ్డి

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తమ మంత్రుల బృందం అమెరికా పర్యటన గురించి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రపంచంలో పేరొందిన కంపెనీలతో సంప్రదింపులు, చర్చలతో తెలంగాణ ప్రభుత్వం సరికొత్త భాగస్వామ్యానికి స్వాగతం పలికిందని సీఎం పేర్కొన్నారు. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు, అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ నుంచి ఫ్యూచర్ సిటీ నిర్మించేందుకు తమ ప్రభుత్వం ఎంచుకున్న ప్రణాళికలకు అమెరికాలోని పారిశ్రామికవేత్తల నుంచి భారీ మద్దతు లభించిందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యాలకు అనుగుణంగా, రాష్ట్ర అభివృద్ధికి సహకరించేలా ప్రఖ్యాత కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులకు తరలిరావటం శుభసూచకమని అన్నారు.

అమెరికా వ్యాపార సామ్రాజ్యానికి తెలంగాణను సరికొత్తగా పరిచయం చేయగలిగామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్​బాబు అన్నారు. రాష్ట్రంలో వివిధ రంగాల పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అనుకూలతలు, ప్రభుత్వం అందించే సహకారాన్ని చాటిచెప్పేందుకు ఈ పర్యటన సత్ఫలితాలను అందించిందని అభిప్రాయపడ్డారు. దీని ప్రభావంతో రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తటంతో పాటు అపారమైన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయనే ఆశాభావం వ్యక్తం చేశారు.

Also Read: స్కూల్ బస్సు బోల్తా..విద్యార్థిని మృతి!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

USA: వాల్ స్ట్రీట్ లో బ్లడ్ బాత్..పెద్ద కంపెనీలన్నీ ఢమాల్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతీకార సుంకాలు అన్ని దేశాల మీద వరుస బాంబ్ లు వేశాయి. దాంతో పాటూ తన సొంత దేశాన్ని కూడా షేక్ చేస్తున్నాయి. టారీఫ్ ల దెబ్బకు వాల్ స్ట్రీట్ లో బ్లడ్ బాత్ మొదలైంది.

New Update
usa

Blood Bath

ట్రంప్ టారీఫ్ ల మోతకు ప్రపంచ మార్కెట్లు కుదేలవుతున్నాయి. నిన్న దాదాపు అన్ని దేశాల మీదనా ట్రంప్ కొత్త టారీఫ్ లను విధించారు. దీని దెబ్బకు దాదాపు అన్ని దేశాల్లో షేర్ మార్కెట్ షేక్ అయింది.   ఈరోజు భారత స్టాక్ మార్కెట్ కూడా దడదడలాడింది. ఘోరంగా షేర్లు పతనం అయ్యాయి. బంగారం ధర మరింత పెరిగింది. ఒక్క ఫార్మా తన్ని మిగతా అన్ని రంగాల షేర్లూ అతలాకుతలం అయ్యాయి. మరోవైపు ఆసియా మార్కెట్ల పరిస్థితీ అలానే ఉంది. ఇప్పుడు అమెరికా వాల్ స్ట్రీట్ వంతు.

బ్లడ్ బాత్..

ఈరోజు మొదలవ్వడమే అమెరికా స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. దాదాపు అన్ని షేర్లూ ఎర్ర రంగు పులుముకున్నాయి. ప్రతీకార సుంకాల మూలంగా వాణిజ్య యుద్ధానికి కాలుదువ్వినట్లు అవ్వడమే కాకుండా.. అగ్రరాజ్యం ఆర్థిక మాంద్యంలోకి వెళుతుందన్న భయాలు నెలకొన్నాయి. ఇది అమెరికా మార్కెట్ ను దెబ్బ తీస్తోంది. దీని కారణంగా ప్రధాన సూచీలన్నీ భారీగా పతనం అయ్యాయి. ఉదయం 10 గంటలకు డౌజోన్స్‌ 1500 పాయింట్లకు పైగా నష్టంతో 40,665 వద్ద ట్రేడవుతోంది. నాస్‌డాక్‌ దాదాపు 5 శాతం మేర క్షీణించగా.. ఎస్‌అండ్‌పీ 500 4 శాతం కుంగింది. అమెరికాలో పెద్ద షేర్లు అని చెప్పుకునే నైకీ 12 శాతం, యాపిల్ 9 శాతం తో నష్టాల్లో నడుస్తున్నాయి. ఐఫోన్లకు ప్రధన సప్లయర్ చైనా..ఆ దేశానికి 54 శాతం సుంకాలు విధించడంతో ఐఫోన్ల సప్లయ్ కు ఆటంక ఏర్పడుతుందనే ఆందోళన మొదలైంది. 2020 తర్వాత యాపిల్‌ స్టాక్‌ ఈ స్థాయిలోపతనం కావడం ఇదే తొలిసారి. వీటిో పాటూ టెస్లా, అమెజాన్, మెటా లాంటి మిగతా ప్రధాన షేర్లు కూడా అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. 

 today-latest-news-in-telugu | usa | donald trump tariffs | stock-market 

Also read: BIG BREAKING : ఊడిపడ్డ చార్మినార్ పెచ్చులు.. పరుగులు తీసిన జనం

Advertisment
Advertisment
Advertisment