Caste Census : కులగణన తర్వాతే పంచాయతీ ఎన్నికలు.. సీఎం రేవంత్‌ సంచలన నిర్ణయం!

తెలంగాణలో బీసీ రిజర్వేషన్లపై మళ్లీ చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో కులగణన చేశాకే ఎన్నికలకు వెళ్తామని సీఎం రేవంత్ అన్నారు. మరోవైపు స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని విపక్ష నేత రాహుల్ గాంధీ తెలిపారు. ఆగస్టులో పంచాయతీ ఎన్నికలు జరగనున్నట్లు సమాచారం.

New Update
Caste Census : కులగణన తర్వాతే పంచాయతీ ఎన్నికలు.. సీఎం రేవంత్‌ సంచలన నిర్ణయం!

Caste Census : తెలంగాణ (Telangana) లో బీసీ రిజర్వేషన్ల (BC Reservations) పై మళ్లీ చర్చ మొదలైంది. త్వరలోనే పంచాయతీ ఎన్నికలు (Panchayat Elections) కూడా జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కులగణన చేశాకే ఎన్నికలకు వెళ్తామని సీఎం రేవంత్ (CM Revanth) అన్నారు. మరోవైపు స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని విపక్ష నేత రాహుల్ గాంధీ తెలిపారు. ఆగస్టులోనే పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సర్పంచుల పదవీకాలం ముగిసి దాదాపు 6 నెలలు పూర్తయింది. అయితే కులగణనకు కాంగ్రెస్ కట్టుబడి ఉంటుందా అనేదానిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Also Read: రీల్స్‌ మోజులో పడి చేయి, కాలు పోగొట్టుకున్న యువకుడు

2011లో కులగణన చేసినా కూడా కేంద్ర ప్రభుత్వం లెక్కలు బయటపెట్టలేదు. 2015లో కర్ణాటకలో, 2023లో బీహార్‌లో కులగణన చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణలో కులగణన ఎలా చేపట్టాలనే దానిపై నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. 2014లో సమగ్ర కుటుంబ సర్వే చేసిన తరహాలోనే వారంరోజుల్లో కులాల లెక్కలు తేల్చొచ్చని అంటున్నారు. మరోవైపు 2011లో 53 కాలమ్స్‌తో కేంద్రం కులగణన చేసింది. మరో 3 కాల్సమ్స్‌ జత చేసి తెలంగాణలో కులు గణన చేయొచ్చని సూచిస్తున్నారు. అయితే ఈ ఫార్మట్‌లో కులగణనకి 5 నెలల సమయం పట్టే అవకాశం ఉంది.

Also Read: కాల్ గర్ల్స్, రేప్ కేసు, డ్రగ్స్ బానిసలే టార్గెట్.. అందినంత దోచేస్తున్న ఫేక్ పోలీస్!

Advertisment
Advertisment
తాజా కథనాలు