CM Revanth Reddy: కేసీఆర్‌ను పరామర్శించిన సీఎం రేవంత్.. ఫొటోలు వైరల్.. సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న మాజీ సీఎం కేసీఆర్‌ను.. సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు. కేసీఆర్ త్వరగా అసెంబ్లీకి రావాలని.. ప్రజల సమస్యలను ప్రస్తావించాలని కోరుతున్నానని రేవంత్ మీడియాతో తెలిపారు. మంచి ప్రభుత్వ పాలన అందించేందుకు ఆయన సూచనలు అవసరమన్నారు. By B Aravind 10 Dec 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి ప్రమాదవశాత్తు గాయం కావండతో బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ హైదరాబాద్ సోమాజిగూడలో యశోద ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ఆసుపత్రికి చేరుకొని కేసీఆర్‌ను పరామర్శించారు. రేవంత్‌తో పాటు మంత్రి సీతక్క, షబ్బీర్ అలీ కూడా ఉన్నారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి మాజీ మంత్రి కేటీఆర్, వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీఎం రేవంత్ మీడియాతో మాట్లాడారు. కేసీఆర్‌ను పరామర్శించానని.. ఆయన వైద్యం కోసం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సీఎస్‌ను ఆదేశించానని తెలిపారు. కేసీఆర్ త్వరగా అసెంబ్లీకి రావాలని.. ప్రజల సమస్యలను ప్రస్తావించాలని కోరుతున్నానని పేర్కొన్నారు. మంచి ప్రభుత్వ పాలన అందించడానికి ఆయన సూచలను చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇదిలా ఉండగా.. రేవంత్ ముందుగా ఆసుపత్రికి రాగానే కేటీఆర్‌ను కలిశారు. కేటీఆర్, రేవంత్‌లు ఆత్మీయంగా ఒకరిపై ఒకరు చేయి వేసుకుంటూ కేసీఆర్ గదిలోకి వెళ్లారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పార్టీల మధ్య ఎంత విభేదాలున్న కేసీఆర్‌ను రేవంత్ పరామర్శించడం గొప్ప విషయమంటూ నెటీజన్లు కామెంట్లు చేస్తున్నారు. శుక్రవారం రాత్రి కేసీఆర్‌కు తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేసిన అనంతరం.. శనివారం రోజున ఆయన వాకర్ సాయంతో నెమ్మదిగా అడుగులు వేయించిన సంగతి తెలిసిందే. Also Read: తెలంగాణ శాసనసభ స్పీకర్ ఎన్నిక ఎప్పుడంటే.. #telugu-news #telangana-news #cm-revanth-reddy #ex-cm-kcr మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి