Telangana: తెలంగాణ సీఎం రేవంత్ వరంగల్ టూర్ వాయిదా

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగ్ టూర్ ఎల్లుండికి వాయిదా పడింది. రేపు కూడా ఆయన ఢిల్లీలో ఉంటున్నందువలన వరంగల్ ఎల్లుండి వెళతారని చెప్పారు. కానీ రేపు జరగాల్సిన ప్రోగ్రామ్స్ అన్నీ ఎల్లుండి యథావిధిగా జరుగుతాయి.

New Update
రేపు వరంగల్ కు సీఎం రేవంత్

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి ఇంకా ఢిల్లీలోనే ఉన్నారు. ఇవాళ అయిపోతుంది అనుకున్న పని రేపటికి కూడా వాయిదా పడడంతో ఆయన వరంగల్ టూర్‌ కూడా వాయిదా పడంది. ఢిల్లీలో పీసీసీ చీఫ్,క్యాబినెట్ విస్తరణ పై రేపు కూడా పార్టీ కాంగ్రెస్ పెద్దలతో చర్చలు కొనసాగనున్నాయి. అందుకే రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉండిపోవాల్సి వచ్చిందని కాంగ్రెస్ వర్గాలు చెప్పాయి.

ఇక రేపు జగాల్సిన వరంగల్ పర్యటన ఎల్లుండికి వాయిదా పడింది. అక్కడ రేపు అవ్వాలని కార్యక్రమాలు అన్నీ కూడా ఎల్లుండే జరగనున్నాయి. వరంగల్‌ సమగ్రాభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. స్మార్ట్‌ సిటీ ప్రాజెక్ట్‌, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ సిస్టం, ఔటర్‌ రింగ్‌ రోడ్డు, మామునూరు ఎయిర్‌పోర్టు తదితర అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. వరంగల్‌ నగరాభివృద్ధికి ప్రణాళికలు రచించాలని ఇప్పటికే రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో అధికారులు డీపీఆర్ లు సిద్ధం చేశారు. ముందుగా పరకాల నియోజకవర్గం గీసుకొండ మండలం శాయంపేటలోని కాకతీయ మెగా జౌళి టెక్స్‌టైల్‌ పార్క్‌ ను ఆయన సందర్శిస్తారు. ఆ తర్వాత హన్మకొండలోని ఓ హాస్పిటల్‌ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అనంతరం నయీమ్‌నగర్‌లోని నాలా పనులను పరిశీలిస్తారు. ఆ తర్వాత హనుమకొండ కలెక్టరేట్‌లో నిర్వహించే రివ్యూ మీటింగ్‌ లో పాల్గొంటారు.

ఇదిలా ఉంటే..  వరంగల్, హనుమకొండ జిల్లాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా మంత్రులు, MLA లు మరియు కలెక్టర్ల తో సమావేశం నిర్వహించనున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధి కోసం సీఎం కు నివేదించనున్న పలు అంశాల పై సమావేశంలో చర్చించారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టు, భూగర్భ డ్రైనేజీ, రింగ్ రోడ్డు, కాళోజీ కళాక్షేత్రం, మామునూరు ఎయిర్ పోర్ట్, కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు, హనుమకొండ ఐడీఓసీ కార్యాలయంలో చేపట్టనున్న వనమహోత్సవం, మహిళాశక్తి కార్యక్రమం తదితర అంశాల పై ప్రజాప్రతినిధులు, అధికారులతో సమాలోచనలు చేశారు.

Also Read:andhra pradesh: గన్ మెన్ లును వెనక్కి పంపిన టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Babu Mohan : రాజకీయాల నుంచి సేవారంగంవైపు... బాబుమోహన్‌ కీలక నిర్ణయం

 ప్రముఖ సినీ నటుడు బాబు మోహన్ తెలియనివారుండరు. తన హాస్యనటనతో ఎందరినో అలరించిన ఆయన ఆ తర్వాత రాజకీయరంగ ప్రవేశం చేశారు. మంత్రిగా కూడా పనిచేశారు. ఈ రోజు సేవా రంగంలోకి అడుగుపెట్టారు. తన కుమారుడి జ్ఞాపకార్థం ‘పవన్ బాబు మోహన్ ఛారిటబుల్ ట్రస్ట్’ను స్థాపించారు.

New Update
Babu Mohan

Babu Mohan

 ప్రముఖ సినీ నటుడు, మాజీ మంత్రి బాబు మోహన్ తెలియనివారుండరు. తన హాస్యనటనతో ఎందరినో అలరించిన ఆయన ఆ తర్వాత రాజకీయరంగ ప్రవేశం చేశారు. తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచి మంత్రిగా కూడా పనిచేశారు. తెలంగాణ రాష్ట్రఏర్పాటు తర్వాత బీఆర్‌ఎస్‌ లో చేరి ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ అనుకోని కారణాల వల్ల ప్రస్తుతం ఆయన ఏ పదవిలో లేరు. అయితే ఆయన ఈ రోజు మరో రంగంలోకి అడుగుపెట్టారు. అదే సేవా రంగం. అవును తన కుమారుడి జ్ఞాపకార్థం ‘పవన్ బాబు మోహన్ ఛారిటబుల్ ట్రస్ట్’ను స్థాపించారు. ఈ ట్రస్ట్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న నిరుపేదలకు చేయూత అందిస్తామని ఆయన ప్రకటించారు. సోమవారం బషీర్ బాగ్‌ ప్రెస్ క్లబ్‌లో జరిగిన ఆవిర్భావ సమావేశంలో బాబు మోహన్ ట్రస్ట్ లక్ష్యాలు, కార్యక్రమాలను వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి అనుమతి పొందిన ఈ ట్రస్ట్.. నిరుపేదలకు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలను కల్పించడంపై ప్రధానంగా దృష్టి సారిస్తుందని ఆయన తెలిపారు. నిరుద్యోగులకు చేయూత అందించడం కూడా ట్రస్ట్ ముఖ్య లక్ష్యాలలో ఒకటిగా పేర్కొన్నారు.

Also Read :  నీకు తక్కువ జీతం పిల్లనివ్వమని ఒకరు.. సంబంధం కుదరడం లేదని మరోకరు.!
 
బాబు మోహన్ మాట్లాడుతూ.. తన కుమారుడి పేరుతో ఏర్పాటు చేసిన ఈ ట్రస్ట్ ద్వారా సమాజంలోని బలహీన వర్గాలకు సహాయం అందించాలనేది తన చిరకాల కోరిక అని అన్నారు. పేదరికం నుంచి బయటపడటానికి విద్య ఒక ముఖ్యమైన సాధనమని ఆయన నొక్కి చెప్పారు. అందుకే.. ట్రస్ట్ ద్వారా నిరుపేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు.. వారికి నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తామని ఆయన తెలిపారు.అలాగే.. సరైన వైద్యం అందక ఇబ్బందులు పడుతున్న వారికి సహాయం అందించడం కోసం.. వైద్య శిబిరాలు నిర్వహించడం, ఆసుపత్రి ఖర్చుల కోసం ఆర్థిక సహాయం చేయడం వంటి కార్యక్రమాలను ఈ ట్రస్ట్ చేపడుతుందని బాబు మోహన్ తెలిపారు. ఉపాధి లేని యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి.. వారు ఉద్యోగాలు పొందేలా సహాయం చేస్తుందన్నారు.

Also Read :  HIT 3 బాహుబలి, RRR రికార్డులను మించి.. ట్రెండింగ్ లో 'హిట్ 3' ట్రైలర్.. ఎన్ని మిలియన్ల వ్యూస్ అంటే!
 
ట్రస్ట్ ద్వారా సహాయం పొందాలనుకునే వారు కోఆర్డినేటర్ రాజ్ కుమార్‌ను 8919511215 నెంబర్‌ ద్వారా సంప్రదించవచ్చని బాబు మోహన్ తెలిపారు. ఈ సందర్భంగా.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం బండారు గూడెం కోయజాతికి చెందిన సమీప అనే విద్యార్థి ఎంటెక్ చేయడానికి, గ్రూప్స్ కోచింగ్ తీసుకోవడానికి బాబు మోహన్ తన ట్రస్ట్ ద్వారా ఆర్థిక సహాయం అందజేశారు.

Also Read :  కడుపుతో ఉన్న భార్యను ఎందుకు చంపాడంటే.. షాకింగ్ విషయాలు చెప్పిన విశాఖ పోలీసులు.. !


బాబు మోహన్ కుమారుడు పవన్ కుమార్ 2003 అక్టోబర్ 12న జరిగిన హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. స్పోర్ట్స్ బైక్ అదుపుతప్పి డివైడర్‌ని ఢీ కొట్టడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. కొడుకు మరణంతో బాబు మోహన్ ఎంతగానో కుంగిపోయారు. కొడుకు పేరిట సేవా కార్యక్రమాలు చేపట్టాలని తాను ఎంతో కాలంగా భావిస్తున్నానని.. కానీ రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల కుదరలేదన్నారు. తాను ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉండటం వల్ల పూర్తి స్థాయిలో ట్రస్ట్ కోసం పని చేస్తానని ఆయన చెప్పారు.

 Also Read :  ముగ్గురు భార్యలు జంప్.. నాలుగో పెళ్లికి రెడీ.. నీ కష్టం పగోడికి కూడా రావొద్దురా!

Advertisment
Advertisment
Advertisment