CM Revanth : రేపు కలెక్టర్లతో సీఎం రేవంత్ సమావేశం.. పలు కీలక నిర్ణయాలు

రేపు అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ‘ప్రజాపాలన’ కార్యక్రమంపై వారితో చర్చించనున్నారు. ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు ‘ప్రజాపాలన’ కార్యక్రమం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

New Update
CM Revanth : రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. అందరికీ డిజిటల్‌ హెల్త్‌ కార్డులు!

CM Revanth Reddy Meet : రేపు అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) సచివాలయంలో కాన్ఫరెన్సు నిర్వహించను న్నారు. దీనికి తగిన ఏర్పాట్లపై సాధారణ పరిపాలన శాఖ దృష్టి పెట్టింది. సచివాలయంలోని ఏడో అంతస్తులోని వెస్టర్న్ డోమ్లో ఈ సమావేశం జరగనుంది. ఈనెల 28 నుంచి జనవరి 6వ తేదీ మధ్యలో జరిగే 'ప్రజా పాలన' పై ఈ సమావేశంలో చర్చ జరగనుంది. సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటి సారి అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో కాన్ఫరెన్సు నిర్వహిస్తున్నారు. తొలుత ఈనెల 21న నిర్వహించేలా టైమ్ ఫిక్స్ చేసి ఏర్పాట్లు చేసుకున్నా అసెంబ్లీ(Assembly) సమావేశాల కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు 24న నిర్వహించేందుకు కసరత్తు ప్రారంభమైంది. సీఎంతో పాటు మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు సైతం ఈ సమా వేశానికి హాజరుకానున్నారు.

ALSO READ: ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సజ్జనార్ కీలక ప్రకటన

ప్రజా పాలనపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయంతో ఉన్నందున ఈనెల 28 నుంచి జనవరి 6 వరకు ఒకేసారి రాష్ట్రమంతా అమలు చేయడానికి సంబంధించిన అంశాలపై ఈ సమావేశంలో ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు. కలెక్టర్లతో పాటు అదనపు కలెక్టర్లు కూడా దీనికి సంబంధించి ప్రణాళికను రూపొందించుకుని తగిన సమాచారంతో రావాల్సిందిగా రెవెన్యూ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఇంతకాలం ప్రగతి భవన్ గా ఉన్న ముఖ్యమంత్రి అధికారిక నివాస బంగళాకు ప్రజా భవన్ అని పేరు పెట్టడంతో పాటు వారానికి రెండు రోజుల పాటు ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తున్న విశాతం తెలిసిందే. అన్ని జిల్లాల్లోనూ ఇదే తరహాలో ఈ ప్రోగ్రామ్ను నిర్వహించాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం పది రోజుల పాటు ప్రజా పాలనను అమలు చేయడంపై కలెక్టర్ల అభిప్రాయాలను తీసుకోవడంతో పాటు తగిన సూచనలు, మార్గ దర్శకాలను ఇవ్వనుంది.

ALSO READ: టీడీపీలో ఫ్యామిలీ ప్యాకేజీ.. టికెట్ల కోసం నేతల పట్టు..

Advertisment
Advertisment
తాజా కథనాలు