Revanth Reddy : ఆ ఆలోచనే కేసీఆర్‌దే.. మేడిగడ్డ విషయంలో తప్పంతా వారిదే : రేవంత్‌రెడ్డి

గతంలో జరిగిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు బీఆర్‌ఎస్‌ తీవ్ర ప్రయత్నం చేస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. మేడిగడ్డ బ్యారేజీ నిరుపయోగమని ఇంజినీర్లు తేల్చారని.. అయినా కేసీఆర్‌ వారి మాట వినలేదని మండిపడ్డారు. ఐదుగురు ఇంజినీర్ల బృందం ఇచ్చిన రిపోర్ట్‌ను బీఆర్‌ఎస్‌ తొక్కిపెట్టిందన్నారు.

New Update
Revanth Reddy : ఆ ఆలోచనే కేసీఆర్‌దే.. మేడిగడ్డ విషయంలో తప్పంతా వారిదే : రేవంత్‌రెడ్డి

Revanth Reddy Slams KCR in Assembly : తెలంగాణ(Telangana) లో కాంగ్రెస్‌(Congress), బీఆర్‌ఎస్‌(BRS) మధ్య వాటర్‌ వార్‌ అంతకంతకూ ముదురుతోంది. మేడిగడ్డ ప్రాజెక్టు(Medigadda Project) విషయంపై అసెంబ్లీలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ఒకరినొకరు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు కట్టాలన్న ఆలోచనే కేసీఆర్‌(KCR) దేనని సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) ఫైర్ అయ్యారు. ఈ విషయాన్ని ఇంజనీర్లకు సూచించింది కూడా కేసీఆరేనని మండిపడ్డారు. రిటైర్డ్‌ ఇంజనీర్లతో కేసీఆర్‌ కమిటీ ఏర్పాటు చేశారని.. ఆ కమిటీ సాగునిటి ప్రాజెక్టులపై ఓ రిపోర్టును ఇచ్చిందన్నారు. అయితే మేడిగడ్డ బ్యారేజీ నిరుపయోగమని ఇంజినీర్లు తేల్చారని.. ఐదుగురు ఇంజినీర్ల బృందం స్పష్టంగా చెప్పిన విషయం ఇదేనన్నారు. గత ప్రభుత్వం ఈ రిపోర్ట్ ను తొక్కి పెట్టిందని ఫైర్ అయ్యారు.

రేవంత్‌రెడ్డి ఏం అన్నారంటే?
--> గతంలో జరిగిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు బీఆర్‌ఎస్‌ తీవ్ర ప్రయత్నం చేస్తోంది.

--> ప్రాజెక్టులపై వాస్తవాలను సభ ముందు పెట్టే ప్రయత్నం ఉత్తమ్ చేశారు.

--> తప్పులతడక అంటూ హరీశ్‌రావు(Harish Rao) తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.

--> పార్లమెంట్‌లో బిల్లు పెట్టినప్పుడు కేసీఆర్ ఎక్కడ ఉన్నారు?

--> పెప్పర్ స్ప్రే బారిన పడింది మా కాంగ్రెస్ ఎంపీలే.

--> తుమ్మిడిహట్టి దగ్గర 152 మీటర్ల ఎత్తులో ప్రాజెక్టు నిర్మిస్తే మహారాష్ట్రలో మునిగిపోయేది 1850 ఎకరాలే.

-->తుమ్మిడిహట్టి దగ్గరే కడితే మంచిదని ఇంజినీర్లు సిఫార్సు చేశారు.

--> 151 మీటర్లతో ప్రాజెక్టు నిర్మించాలని పదేపదే చెప్పారు.

--> ఇప్పటికైనా తప్పులు ఒప్పుకోండి.. కప్పిపుచ్చుకోండి.

ఎంతో ద్రోహం చేశారు:
తెలంగాణ ఖాజానాను కొల్లగొట్టేందుకు ఇంత దుర్మార్గానికి తెగపడ్డారంటూ మేడిగడ్డ విషయంలో కేసీఆర్‌, హరీశ్‌రావుపై రేవంత్‌ విరుచుకుపడ్డారు. కేసీఆర్ , హరీష్ కలిసి రాష్ట్రానికి ద్రోహం చేశారని.. కాళేశ్వరం తెలంగాణకు వరప్రదాయిని కాదు... కాళేశ్వరం తెలంగాణకు ఒక కళంకంగా మిగిలిపోయిందని ఆరోపించారు. క్షమాపణలు చెప్పాల్సిందిపోయి.. నిస్సిగ్గుగా సభలో నిలబడి మమ్మల్ని ప్రశ్నిస్తారా అని నిలదీశారు రేవంత్. ప్రాజెక్టులు పగిలిపోతుంటే క్షమాపణలు చెప్పకుండా.. ఇంకా వాదిస్తారా అని ప్రశ్నించారు. ఈ పాపాలకు మామా అల్లుళ్లు కారణం కాదా అంటూ రెచ్చిపోయారు రేవంత్. ఇలాంటి పరిస్థితుల్లో మొండి వాదనలు... తొండి వాదనలు వద్దు అంటూ హరీశ్‌రావుకు చురకలంటించారు. మీరు నియమించిన అధికారుల నివేదికనే మీరు తప్పు పడతారా అని క్వశ్చన్ చేశారు రేవంత్. ఆనాడు దీక్షలు, ధర్నాలు చేసిన సబితక్క.. ఈనాడు హరీష్ రావుని సమర్ధిస్తున్నారా అని ఎద్దెవా చేశారు.

Also Read: అసెంబ్లీలో హరీశ్‌ నోట గద్దర్, అందెశ్రీ పాట.. వీడియో వైరల్‌!

Advertisment
Advertisment
తాజా కథనాలు