Telangana: హైదరాబాద్‌కు సమానంగా వరంగల్ అభివృద్ధి.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

హైదరాబాద్‌తో సమానంగా వరంగల్‌ను అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్‌ అధికారులకు ఆదేశించారు. వరంగల్‌ను హెరిటేజ్ నగరంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికను రూపొందించాలని పేర్కొన్నారు. ఇన్నర్‌, ఔటర్ రింగ్‌రోడ్డుకు భూ సేకరణను పూర్తి చేయాలని సూచించారు.

New Update
Runa Mafi: రెండో విడత రుణమాఫీ అప్పుడే చేస్తాం.. సీఎం రేవంత్ కీలక ప్రకటన!

వరంగల్ అభివృద్ధికి సహకారం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సీఎం రేవంత్‌ అధికారులకు చెప్పారు. హైదరాబాద్‌తో సమానంగా వరంగల్‌ను అభివృద్ధి చేయాలని సూచనలు చేశారు. ఈరోజు వరంగల్ పర్యటనలో భాగంగా ఆయన నగర అభివృద్ధిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వరంగల్‌ను హెరిటేజ్ నగరంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికను రూపొందించాలని పేర్కొన్నారు. ఇన్నర్‌, ఔటర్ రింగ్‌రోడ్డుకు భూ సేకరణను పూర్తి చేయాలని.. దీనికి అవసరమైన నిధుల వివరాలు ప్రభుత్వానికి అందించాలని తెలిపారు.

Also Read: మరో స్టాండప్‌ కమెడియన్‌ని టార్గెట్ చేసిన రాజాసింగ్..

రహాదారులను అనుసంధానిస్తూ.. వరంగల్ ఔటర్ రింగ్‌రోడ్డు ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు. ఓఆర్‌ఆర్‌ నుంచి టెక్స్‌టైల్ పార్కును అనుసంధానించాలని చెప్పారు. స్మార్ట్‌సిటీలో భాగంగా భుగర్భ డ్రైనేజీని అభివృద్ధి చేయాలని.. నాలాలు ఆక్రమణలకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అలాగే డంపింగ్‌ యార్టు సమస్యకు కూడా శాశ్వత పరిష్కారం చూపించాలని ఆదేశాలు జారీ చేశారు.

Also read: తెలంగాణలో ఒక్క హాస్టల్‌కి కూడా రిజిస్ట్రేషన్ లేదు..

Advertisment
Advertisment
తాజా కథనాలు