CM Revanth Reddy: ఈ నెల 27 నుంచి మరో రెండు గ్యారెంటీలు.. సీఎం రేవంత్ సంచలన ప్రకటన

తెలంగాణలో మరో రెండు గ్యారెంటీల అమలుకు తేదీ ఖరారు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. మేడారం పర్యటనలో ఉన్న సీఎం రేవంత్.. ఈ నెల 27 నుంచి ఉచిత కరెంట్, రూ.500లకే గ్యాస్ సిలిండర్ పథకాలను ప్రియాంక గాంధీ చేతులు మీదుగా ప్రారంభించనున్నట్లు తెలిపారు.

New Update
CM Revanth Reddy: ఈ నెల 27 నుంచి మరో రెండు గ్యారెంటీలు.. సీఎం రేవంత్ సంచలన ప్రకటన

Telangana Govt to Implement Two More Guarantees : తెలంగాణ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రెండో రోజే ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీ(6 Guarantees) ల్లో రెండు గ్యారెంటీలైన మహాలక్ష్మి పథకం(Mahalakshmi Scheme) కింద ఆర్టీసీ బస్సు  లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం (Free Bus Scheme).. అలాగే మరో గ్యారెంటీ ఆరోగ్యశ్రీ కార్డు(Arogyasri Card) పరిమితి పెంపు వంటి పథకాలను అమల్లోకి తెచ్చిన రేవంత్ సర్కార్ తాజాగా మరో రెండు గ్యారెంటీలను అమలు చేసేందుకు కసరత్తు చేసింది. రూ.500కే గ్యాస్ సిలిండర్‌, 200 యూనిట్ల ఫ్రీ కరెంటు స్కీంలు అమలుపై కార్యాచరణ రూపొందించింది.

ఈ నేల 27 నుంచే..

తాజాగా మేడారం జాతరలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి మరో రెండు గ్యారెంటీల అమలుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 27 నుంచి మరో రెండు గ్యారెంటీలను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నట్లు తెలిపారు. ప్రియాంక గాంధీ చేతుల మీదిగా ఈ పథకాలను ప్రారంభించనునట్లు తేల్చి చెప్పారు. అర్హులైన వారికి ఈ నెల 27 నుంచి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ (Free Current).. అలాగే రూ.500 లకే గ్యాస్ సిలిండర్ ను (Gas Cylinder) అందించనుంది రేవంత్ సర్కార్.

Also Read: ఎమ్మెల్యే లాస్య నందిత పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో సంచలన విషయాలు

వారం రోజుల్లో మెగా డీఎస్సీ..

తెలంగాణలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చే దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు(Job Notifications) ఇచ్చేందుకు రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తోంది. భారీ ఎత్తున ఖాళీలను భర్తీ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. వారం రోజుల్లో 11 వేల పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్దమైనట్లు సమాచారం. 

563 పోస్టులతో గ్రూప్-1 నోటిఫికేషన్..

గ్రూప్-1 కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. 563 పోస్టులతో కొత్త నోటిఫికేషన్‌ను టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. ఈ నెల 23 నుంచి మార్చి 14 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. వయోపరిమితిని 44 నుంచి 46 ఏళ్లకు పెంచింది రేవంత్‌ సర్కార్‌. మే లేదా జూన్‌లో ప్రిలిమినరీ పరీక్ష ఉండే అవకాశముంది. అలాగే సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌లో మెయిన్స్ పరీక్ష ఉండనున్నట్లు తెలుస్తుంది. గతంలో గ్రూప్‌-1 కు అప్లై చేసుకున్నవాళ్లు.. ఈసారి కూడా దరఖాస్తు చేసుకోవాలని TSPSC ఆదేశించింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు