CM Revanth: కాలుష్య రహిత మూసీ నదిగా మార్చేలా ప్రణాళిక చేశాం: సీఎం రేవంత్ రాష్ట్రంలో చేపట్టిన పలు ప్రాజెక్టులకు సహరలించాలని..న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు డైరెక్టర్ జనరల్ డీజే పాండియన్‌ను సీఎం రేవంత్ కోరారు. హైదరాబాద్ మూసీనది పునరుజ్జీవ ప్రాజెక్టును అంతర్జాతీయ ప్రమాణాలతో పర్యవరణాన్ని కాపాడేలా ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. By B Aravind 01 Feb 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి రాష్ట్రంలో చేపట్టిన పలు కీలక ప్రాజెక్టులకు సంబంధించిన విషయాల్లో సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు డైరెక్టర్ జనరల్ డీజే పాండియన్‌ను కోరారు. సచివాలయంలో.. రేవంత్‌ను ఎన్‌డీబీ డీజీ మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ మూసీనది పునరుజ్జీవ ప్రాజెక్టును అంతర్జాతీయ ప్రమాణాలతో పర్యవరణాన్ని కాపాడేలా.. కాలుష్యం లేకుండా, సహజ వనరులకు ఎలాంటి విఘాతం కలగకుండా అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రూపొందించామని ముఖ్యమంత్రి తెలిపారు. Also read: మేడిగడ్డ కుంగుబాటు మానవ తప్పిదమే.. రిపోర్టులో కీలక విషయాలు అలాగే మెట్రో రైలుకి సంబంధించి రెండో దశ ప్రాజెక్టు, నైపణ్యాభివృద్ధి, శిక్షణ కేంద్రాల ఏర్పాటు, ఆసుపత్రులు, విద్యా సంస్థలు, వసతి గృహాలు, వ్యర్థ పదార్థాల శుద్ధి కేంద్రాలు, గృహ నిర్మాణ ప్రాజెక్టులకు సహకరించాలని సీఎం రేవంత్ ఎన్‌డీబీ డీజీ పాండియన్‌ను కోరారు. రాష్ట్ర అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని డీజే పాండియన్ హామీ ఇచ్చారు. అయితే ఈ సమావేశంలో.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి, సీఎస్ శాంతికుమారి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. Also Read: రేవంత్ సర్కార్ ఉంటదో..ఉండదో..నాకైతే డౌటే..కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు..!! #telugu-news #telangana-news #cm-revanth-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి