Telangana: కాంగ్రెస్‌లో బీఆర్‌ఎస్‌ఎల్పీ విలీనం!.. రేవంత్ బిగ్ ప్లాన్

బీఆర్‌ఎస్ఎల్పీని కాంగ్రెస్‌లో విలీనం చేయడమే లక్ష్యంగా సీఎం రేవంత్ వ్యూహాలు రచిస్తున్నారు. ప్రస్తుతం బీఆర్‌ఎస్‌కు 38 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. 26 మందిని కాంగ్రెస్‌లో చేర్చుకునేలా స్కెచ్ వేస్తున్నట్లు సమాచారం.

New Update
Telangana: కాంగ్రెస్‌లో బీఆర్‌ఎస్‌ఎల్పీ విలీనం!.. రేవంత్ బిగ్ ప్లాన్

CM Revanth Reddy: కాంగ్రెస్‌లో బీఆర్‌ఎస్‌ఎల్పీ విలీనమే లక్ష్యంగా సీఎం రేవంత్ అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం బీఆర్‌ఎస్‌కు 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 26 మందిని కాంగ్రెస్‌లో చేర్చుకునేలా స్కెచ్ వేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కాంగ్రెస్‌లో ఏడుగురు బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు చేరారు. కాసేపట్లో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌ చేరనున్నారు. దీంతో మొత్తంగా ఎనిమిదికి సంఖ్య చేరుకోనుంది. అయితే BRSLPని కాంగ్రెస్‌లో విలీనం చేయాలంటే మూడింట రెండింతల మెజార్టీ అవసరం అవుతుంది. అందుకే మరో 18 మందిని చేర్చుకోవాలని రేవంత్ సర్కార్ యోచిస్తోంది.

Also Read: చంద్రబాబును మెచ్చుకున్న కేటీఆర్‌.. ఎందుకో తెలుసా?

మొత్తం 26 మందిని చేర్చుకున్నట్లైతే BRSLP.. CLP లో విలీనం అవుతుంది. అప్పుడు ఆ ఎమ్మెల్యేలపై అనర్హతవేటు పడే అవకాశం ఉండదు. ఒకవేళ 27 మంది ఎమ్మెల్యేలను చేర్చుకుంటే అప్పుడు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 11కు పడిపోనుంది. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కావాలంటే 12 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. ఒక వేళ ఇది జరిగితే బీఆర్‌ఎస్ పార్టీ చివరికి ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ నెల 24న అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యేకల్లా చేరికల ప్రక్రియను పూర్తి చేయాలని రేవంత్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Also read: గ్రూప్-1 మెయిన్స్‌ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. నెలకు ఐదు వేల స్టైఫండ్!

ఇదిలాఉండగా.. బీఆర్‌ఎస్‌లో కేవలం నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమే మిగులుతారని.. ఐటీశాఖ మంత్రి శ్రీధర్ బాబు ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌లో చేరేందుకు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని అన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు