CM Jagan: పంద్రాగష్టు వేడుకల్లో ఆసక్తికర ఘటన.. కింద పడిన మెడల్ తీసిన సీఎం జగన్

77వ స్వాతంత్ర్య దినోత్స వేడుకలు అంబరాన్నంటాయి. దేశ వ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్స వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో కూడా పంద్రాగష్టు వేడుకలు ఘనంగా జరిగాయి. విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో సీఎం జగన్ పతాకావిష్కరణ చేశారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసులకు మెడల్స్ ప్రదానం చేశారు సీఎం. అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన పోలీసు అధికారులకు మెడల్స్ ప్రదాన సమయంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. గ్రే హౌండ్స్ కు చెందిన గౌరు నాయకుడుకు మెడల్ ప్రధానం చేశారు సీఎం జగన్. ఆ తర్వాత గౌరు నాయుడు సెల్యూట్ చేస్తుండగా బహుకరించిన మెడల్ కిందపడటంతో.. సీఎం జగన్ వెంటనే కింద పడిన మెడల్ ను తీసి మళ్లీ.. సంబంధిత వ్యక్తికి ప్రదానం చేశారు. దీంతో గౌరు నాయుడు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు.

New Update
YSR Kapu Nestham Scheme: ఏపీలో మహిళలకు గుడ్ న్యూస్.. త్వరలోనే అకౌంట్ లోకి రూ.15 వేలు

CM Jagan in Vijayawada : 77వ స్వాతంత్ర్య దినోత్స వేడుకలు అంబరాన్నంటాయి. దేశ వ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్స వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో కూడా పంద్రాగష్టు వేడుకలు ఘనంగా జరిగాయి. విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో సీఎం జగన్ పతాకావిష్కరణ చేశారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసులకు మెడల్స్ ప్రదానం చేశారు సీఎం. అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన పోలీసు అధికారులకు మెడల్స్ ప్రదాన సమయంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. గ్రే హౌండ్స్ కు చెందిన గౌరు నాయకుడుకు మెడల్ ప్రధానం చేశారు సీఎం జగన్. ఆ తర్వాత గౌరు నాయుడు సెల్యూట్ చేస్తుండగా బహుకరించిన మెడల్ కిందపడటంతో.. సీఎం జగన్ వెంటనే కింద పడిన మెడల్ ను తీసి మళ్లీ.. సంబంధిత వ్యక్తికి ప్రదానం చేశారు. దీంతో గౌరు నాయుడు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు.

కాగా అనంతరం సీఎం మాట్లాడుతూ.. మన జెండా.. 140 కోట్ల మంది భారతీయుల గుండె. ఇది మన దేశ ప్రజాస్వామ్యానికి గుర్తు.. ఈ జెండా నిరంతరం మనకు స్ఫూర్తిని ఇస్తుందన్నారు జగన్. వ్యవసాయం, పరిశ్రమ, సేవారంగంలో.. 76 ఏళ్లలో ఎంతో ప్రగతి కనిపించిందన్నారు. సచివాలయాల ద్వారా గ్రామ స్వరాజ్యం సాధ్యమైందన్నారు. గ్రామాల అభివృద్ధికి 50 నెలల్లో ఏన్నో చేశామన్నారు. రైతులను ఆదుకునేందుకు పంట బీమా అమలు చేస్తున్నట్లు తెలిపారు. రైతులకు పెట్టుబడి కోసం రైతు భరోసా ఇస్తున్నామన్నారు.

అర్హులందరికీ పథకాలు అందిస్తున్నామని చెప్పుకొచ్చారు సీఎం జగన్. విత్తనం నుంచి అమ్మకం వరకు రైతుకు అండగా నిలుస్తామన్నారు. తమ ప్రభుత్వంలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తెచ్చామని, ఇన్నేళ్లలో ఏ ప్రభుత్వం చేయని గొప్ప మార్పు తీసుకువచ్చినట్టు సీఎం పేర్కొన్నారు. 2 లక్షల 31 వేల కోట్లను నేరుగా ప్రజలకు అందించామని, రాష్ట్రంలో ఎలాంటి లంచాలు, వివక్ష లేకుండా పేదలకు సంక్షేమ పథకాలను అందించామని వివరించారు.

మరే ప్రభుత్వమూ అమలు చేయని విధంగా.. అవినీతి వ్యతిరేకంగా.. లబ్ధిదారులకే పథకాలు అందేలా చేస్తున్నామన్నారు సీఎం. లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లలోకే డబ్బులను వేశామన్నారు. ప్రతీ పథకం అమలులోనూ.. సోషల్ ఆడిట్ తప్పని సరి చేశామన్నారు. పారదర్శకంగా లబ్ధిదారుల్ని ఎంపి చేస్తున్నామన్నారు. 76 సంవత్సరాల్లో మరే ప్రభుత్వం ఇలా చేయలేదన్నారు. సామాజిక న్యాయాన్ని అమలు చసి చూపించామన్నారు. మంత్రి మండలిలో 68 శాతం పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చామన్నారు సీఎం జగన్.

Also Read: ఆ ఊరిలో ఇండిపెండెన్స్ డే చాలా స్పెషల్.. కారణం ఇదే..!

Advertisment
Advertisment
తాజా కథనాలు