/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/jagan-1-jpg.webp)
YSR Sunna Vaddi Shceme : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (YS Jagan) డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా విచ్చేశారు. ఈ సందర్భంగా అమలాపురం జిల్లా జనుపల్లి గ్రామంలో ఏర్పాటయిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. తొలుత తాడేపల్లిలోని ఆయన నివాసం నుంచి బయల్దేరి అమలాపురంలోని పోలీస్ గ్రౌండ్స్‌కు సీఎం జగన్ చేరుకున్నారు. నాలుగో విడత వైఎస్సాఆర్ సున్నా వడ్డీ పథకం (YSR Sunna Vaddi Scheme) కింద పొదుపు మహిళల ఖాతాల్లోకి వడ్డీ డబ్బును జగన్ బటన్ నొక్కి విడుదల చేస్తారు.
ముఖ్యమంత్రి రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్న 9.48 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని 1,05,13,365 మంది మహిళలు బ్యాంకులకు చెల్లించిన రూ.1,353.76 కోట్ల వడ్డీని రీయింబర్స్ చేస్తూ వారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు.
ఈరోజు విడుదల చేసే రూ.1,353.76 కోట్లతో కలిపి వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద ఇప్పటివరకు మొత్తం సాయం రూ.4,969.05 కోట్లకు చేరుతుంది. పేద మహిళలకు సాధికారత కల్పిస్తూ వారు చేస్తున్న వ్యాపారాలకు మరింత చేయూతనిచ్చేలా వారికి సున్నా వడ్డీకే రుణాలు అందిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
బ్యాంకు రుణాలు సకాలంలో చెల్లించిన పొదుపు సంఘాల్లోని మహిళల మీద వడ్డీ భారం పడకుండా వారి తరపున ఆ భారాన్నీ వైఎస్సార్ సున్నా వడ్డీ కింద నేరుగా పొదుపు సంఘాల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తోంది.
Also Read: హస్తినకు వైఎస్ షర్మిల..ఈ రోజు ఖర్గేతో భేటీ..విలీనం పై రానున్న క్లారిటీ!