Andhra Pradesh: 14 రోజుల్లో ఆ పని పరిష్కరించాలి: సీఎం చంద్రబాబు

వాహనదారుల ఇన్సురెన్స్ క్లెయిమ్స్14 రోజుల్లో పరిష్కరించాలని సీఎం చంద్రబాబు బీమా కంపెనీలకు సూచించారు. అయితే వరదలు యాక్ట్ ఆఫ్‌ గాడ్‌ కావడంతో ఇందుకు బీమా సంస్థలు ఒప్పుకోవడం లేదు. వాహనాదారులకు ఇన్సురెన్స్ వస్తుందా ?రాదా ? తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Andhra Pradesh: 14 రోజుల్లో ఆ పని పరిష్కరించాలి: సీఎం చంద్రబాబు

'వాహనదారుల క్లెయిమ్స్14 రోజుల్లో పరిష్కరించాలి.. ఆన్‌లైన్ విధానం ద్వారా త్వరతగతిన అవసరమైన ప్రక్రియ పూర్తిచెయ్యాలి..' బీమా కంపెనీలకు సీఎం చంద్రబాబు చెప్పిన మాటలివి..! వరద బురదలో చిక్కుకున్న వాహనాలకు బీమా వర్తింపచేయాలని చంద్రబాబు కోరుతున్నారు. ఉమ్మడి కృష్ణాజిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు చాలా వాహనాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. అసలు చాలా బైకులు, కార్లు పూర్తిగా పనికిరాకుండా పోయాయి. దీంతో వాహన యజమానులు లబోదిబోమంటున్నారు. పరిస్థితిని అర్థం చేసుకున్న చంద్రబాబు బీమా కంపెనీలతో మాట్లాడి కీలక సూచనలు చేశారు.

రుణాలు ఇవ్వాలి

వరదల కారణంగా చాలా చోట్ల బైక్‌లు, కార్లు నీటమునిగాయి. ఇళ్లల్లోని టీవీలు, ఫ్రిడ్జ్‌లు, ఏసీలు కూడా పాడైపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో బ్యాంకర్లు నిబంధనలు సరళతరం చేసి ప్రజలకు రుణాలు ఇవ్వాలని చంద్రబాబు సూచించారు. అలాగే ఇన్సూరెన్స్ కంపెనీలు 10 రోజుల్లో వాహన, ఇతర బీమాను సెటిల్ చెయ్యాలని చెప్పారు. అయితే చంద్రబాబు కోరింది అసలు సాధ్యమేనన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. బీమా కంపెనీలు చంద్రబాబు చెప్పినదానికి అంగీకరిస్తాయా అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు చంద్రబాబు కోరింది సాధ్యంకాదని కొందరు చెబుతుండగా.. మరికొందరు మాత్రం సాధ్యమేనంటున్నారు. ఇంతకీ ఏది కరెక్ట్? వాహన బిమా పాలసీలు ఏం చెబుతున్నాయి?

భారతీయ వాహనాల చట్టం ప్రకారం రోడ్డుపై ప్రతీ వెహికల్‌కు బీమా ఉండాల్సిందే. కనీసం థర్డ్‌ పార్టీ ఇన్సూరెన్స్‌ తప్పనిసరి. అయితే విస్త్రత బీమా ప్రయోజనాలు కల్పించేది సమగ్ర బైక్ బీమా. ప్రమాదం, దొంగతనం, వరదలు, ప్రకృతి వైపరీత్యాలు లాంటి వాటిని ఈ బీమా కవర్ చేస్తుంది. ఇక ప్రస్తుతం విజయవాడతో పాటు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో బైకులు పాడవడానికి ప్రధాన కారణం వరదలే. అంటే సమగ్ర బీమా కింద మేలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే చంద్రబాబు చెప్పిన 10 రోజుల్లో ఇన్సూరెన్స్‌ను క్లయిమ్‌ చేసుకునే ఛాన్స్ ఉందా అంటే తెలియని పరిస్థితి. ఇది సంబంధిత బీమా సంస్థలే చెప్పాల్సి ఉంటుంది.

అలా చేయడం నేరం

బీమా లేకుండా కారు డ్రైవింగ్ చేయడం నేరం. దీనికి జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా పడుతుంది. దొంగతనం, ప్రకృతి వైపరీత్యాలతో పాటు ప్రమాదంలో చిక్కుకున్న ఇరువర్గాలకు జరిగే నష్టాన్ని సమగ్ర బీమా కవర్ చేస్తుంది. ఇటు విజయవాడ వరదల్లో చాలా కార్లు పాడైపోయాయి. అసలు కొన్ని కార్లు మట్టిలో కూరుకుపోయాయి. వాటిని భారీ మెషీన్ల సాయంతో బయటకు తియ్యాల్సి వచ్చింది. కారు రిపైర్‌కు వేల రూపాయలు ఖర్చు అవుతోంది. పైగా వ్యాపారస్తులు ప్రస్తుత ప్రకృతి విలయాన్ని క్యాష్‌ చేసుకునే పనిలో ఉన్నారు. దీంతో కారు యజమానులకు తడిసి మోపెడవుతోంది.

ఓవైపు వరదలతో ఇళ్లు గుల్లవడం, ఇటు సొంత వాహనాలు ఘోరంగా దెబ్బతినడంతో ప్రజల బాధ వర్ణాణతీతంగా మారింది. దీంతో నేరుగా సీఎం చంద్రబాబు ఈ సమస్యపై దృష్టి పెట్టారు. బీమా కంపెనీలతో మాట్లాడారు. అయితే చంద్రబాబు కోరినట్టుగా 10 రోజుల్లో పాలసీని క్లయిమ్‌ చేసి ప్రజలను కంపెనీలు ఆదుకుంటాయా అనేది చూడాల్సి ఉంది. ఒకవేళ పెద్ద మనసు చేసుకోని ముందుకొస్తే అది చాలా గొప్ప విషయమే అవుతుంది. ఇక అంతకంటే ముందు అసలు చంద్రబాబు కోరింది సాధ్యమా? ఒక వేళ సాధ్యమైతే బీమా పొందేందుకు కొత్తగా పెట్టే నిబంధనలేంటివి లాంటివి కంపెనీలు ప్రకటించాల్సి ఉంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు