/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/67.jpg)
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు అంతరం తిరుమల శ్రీవారి దర్శనం కోసం తిరుపతికి బయలుదేరారు. ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ఆయనకి ప్రభుత్వ అధికారులు పార్టీ సీనియర్ నాయకులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన తిరుమలకు బయలుదేరి వెళ్లారు. మార్గమధ్యంలో తిరుపతి కపిల తీర్థం వద్ద ఉన్న టిడిపి పార్టీ ఆఫీస్ వద్ద నాయకులు కార్యకర్తలు భారీగా చేరుకోవడంతో ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు కాన్వాయ్ దిగి అందరికీ అభివాదం చేసి తిరుమల వెళ్లారు. రాత్రికి తిరుమలలో గాయత్రి అతిధి భవనంలో బస్ చేసి, మర్నాడు ఉదయం 7 గంటల సమయంలో వెంకటేశ్వర స్వామిని నిజరూప దర్శనంలో దర్శించుకుని ముక్కులు చెల్లించుకుంటారు.