ఆగష్టులో తిరుమలకి వెళ్లే శ్రీవారి భక్తులకు అలర్ట్ By E. Chinni 26 Jul 2023 in ఆంధ్రప్రదేశ్ తిరుపతి New Update షేర్ చేయండి ఆగష్టులో తిరుమలకి వెళ్లే శ్రీవారి భక్తులకు అలర్ట్ జారీ చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం. తిరుమలలో శ్రీవారి ఆలయం వద్ద గల పుష్కరిణిలో నీటిని పూర్తిగా తొలగించి.. పైపులైన్ల మరమ్మత్తులు, సివిల్ పనులు చేపట్టాలని టీటీడీ నిర్ణయించింది. ఈ కారణంతో ఆగష్టు 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు పుష్కరిణిని మూసివేయాలని నిర్ణయించింది. దీంతో నెల రోజుల పాటు పుష్కరిణి హారతి ఉండదని తిరుమల తిరుపతి దేవస్థానం ఓ ప్రకటనలో వెల్లడించింది. వాస్తవానికి స్వామివారి పుష్కరిణిలో నీరు నిల్వ ఉండే అవకాశం లేదు. పుష్కరిణిలోని నీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగించేందుకు అత్యుత్తమ రీసైక్లింగ్ వ్యవస్థ అందుబాటులో ఉంది. నిరంతరాయంగా నీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగిస్తారు. కానీ శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఒక నెల రోజుల పాటు పుష్కరిణిలో నీటిని తొలగించి చిన్న చిన్న మరమ్మతులను పూర్తి చేస్తారు. మొదటి పది రోజులు పుష్కరిణి మరమ్మత్తుల కోసం.. అనంతరం పుష్కరిణిలో నిటీని నింపు పూర్తిగా సిద్ధం చేస్తారు. పుష్కరిణిలో నీటి పీహెచ్ విలువ 7 ఉండేలా చూస్తారు. టీటీడీ వాటర్ వర్క్స్ విభాగం ఆధ్వర్యంలో ఈ పనులు జరగనున్నాయి. శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించాలని తిరుమల తిరుపతి విజ్ఞప్తి చేసింది. #ap-news #tirumala #latest-news #ttd #pushkarini #srivari-temple మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి