Crime News : దారుణం.. లెక్చరర్‌ను కత్తితో పొడిచి చంపిన స్టూడెంట్..

అస్సోంలో కెమిస్ట్రీ పాఠాలు చెప్పే ఓ లెక్చరర్‌.. ఓ విద్యార్థి సరిగా చదవడం లేదని అతని తల్లిదండ్రులను పిలుచుకురమ్మనాడు. విద్యార్థి పేరెంట్స్‌ను తీసుకురాకపోవడంతో అతడిని క్లాస్ నుంచి వెళ్లిపొమ్మన్నాడు. దీంతో ఆ విద్యార్థి.. లెక్చరర్‌ను కత్తితో పొడిచి చంపాడు.

New Update
Crime News : దారుణం.. లెక్చరర్‌ను కత్తితో పొడిచి చంపిన స్టూడెంట్..

Assam School : అస్సోం (Assam) లో దారుణం జరిగింది. ఓ విద్యార్థి (Student) ఏకంగా పాఠాలు చెప్పే ఉపాధ్యాయుడిని (Teacher) కత్తితో పొడిచి చంపడం కలకలం రేపింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. శివసాగర్ జిల్లాలో రాజేష్ బారువా (55) అనే వ్యక్తి కెమిస్ట్రీ లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. శుక్రవారం ఎప్పటిలాగే ఇంటర్ ఫస్ట్‌ ఇయర్ విద్యార్థులకు పాఠాలు చెప్పేందుకు తరగతి గదికి వచ్చారు. ఆ తర్వాత ఓ విద్యార్థిని.. సరిగా చదవడం లేదని, మీ తల్లిదండ్రులను పిలుచుకొని రావాలంటూ మందలించాడు.

Also read: ఉత్తరాఖండ్‌ను ముంచెత్తుతున్న వరదలు.. చార్‌ధామ్‌ యాత్ర నిలిపివేత

మరుసటి రోజున ఆ విద్యార్థి సివిల్‌ డ్రెస్‌తో తరగతి గదికి వచ్చాడు. పాఠం చెప్పెందుకు క్లాస్‌కు వచ్చిన రాజేష్ బారవా ఆ విద్యార్థిని లేపి.. మీ పేరెంట్స్‌ను తీసుకొచ్చావా అని అడిగాడు. ఆ విద్యార్థి సమాధానం చెప్పకపోవడంతో క్లాస్ నుంచి వెళ్లిపో అంటూ గట్టిగా అరిచాడు. దీంతో అప్పటికే పక్కా ప్లాన్‌తో క్లాస్‌కు వచ్చిన ఆ విద్యార్థి తన వద్ద ఉన్న కత్తితో లెక్చరర్‌ రాజేష్‌పై దాడి చేశాడు. తలపై తీవ్రంగా పొడిచి అక్కడినుంచి పారిపోయాడు. తీవ్ర గాయాలపాలైన రాజేష్‌ను అక్కడున్న సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. కానీ ఆయన అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో పోలీసులు కేసు (Police Case) నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

Also Read: భూమిని తాకనున్నభారీ ఉల్క..హెచ్చరించిన ఇస్రో!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Nightclub Roof Collapses : కూలిన నైట్ క్లబ్..150 మంది స్పాట్ లోనే...

నార్త్‌ అమెరికా డొమినికన్ రిపబ్లిక్ లోని సంతో డామింగో నగరంలో జెట్ సెట్ నైట్‌ క్లబ్ లో పై కప్పు కూలడంతో సుమారు 18 మంది మరణించారు. 120 మందికి పైగా గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు.శిథిలాల కింద మరికొంతమంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది.

New Update
Dominican Republic Nightclub Roof Collapses At Club

Dominican Republic Nightclub Roof Collapses At Club

Nightclub Roof Collapses : నార్త్‌ అమెరికా డొమినికన్ రిపబ్లిక్ లోని సంతో డామింగో నగరంలో జెట్ సెట్ నైట్‌ క్లబ్ లో పై కప్పు కూలడంతో సుమారు 18 మంది మరణించారు, 120 మందికి పైగా గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శిథిలాల కింద మరికొంతమంది ఉండవచ్చని తెలుస్తోంది. భారత కాలమానం ప్రకారం ఏప్రిల్ 8 న తెల్లవారుజామున 12:45 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

Also Read: ఆ నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోండి..లేదంటే...చైనాకు ట్రంప్ హెచ్చరికలు!


క్లబ్ లో మెరెంగే సింగర్ రూబీపెరెజ్‌ ప్రదర్శన ఇస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. రూబీ ప్రదర్శన జరుగుతున్న సమయంలో ఒక సారిగా భారీ శబ్ధంతో రూప్‌ కూలిపోవడంతో అప్పటివరకు ఆనందంతో కెరింతలు కొడుతున్న వారంతా హాహాకారాలు చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడున్న వారంతా ప్రాణభయంతో పరుగులు తీశారు. 

Also Read: Bigg Boss 9: కింగ్‌కు రెస్ట్.. బరిలోకి బాలయ్య- బిగ్ బాస్ 9 ఫుల్ కంటెస్టెంట్ లిస్ట్ ఇదే..


ఈ ప్రమాదంలో రూబీ పెరెజ్‌ గాయపడడంతోపాటు ఆయన బృందలోని శాక్సోఫోనిస్ట్ కూడా మరణించినట్లు తెలుస్తోంది. క్లబ్‌లో ప్రమాదం జరిగన సమయంలో  సుమారు 500 నుండి 1000 మంది ఉన్నట్లు తెలుస్తోంది.. శిథిలాల కింద మరికొంతమంది ఉండవచ్చని భావిస్తున్నారు. 400 మంది సహాయక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. కాగా  జెట్ సెట్ నైట్‌ క్లబ్ లో ప్రతిరోజు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుంటాయని కానీ ఈ రోజు ప్రమాదం జరగడానికి కారణం ఏంటని మాత్రం తెలియరాలేదు. రూప్‌ బలహీనంగా ఉండటం వల్ల ప్రమాదం జరిగి ఉండవచ్చన్న వాదన వినపడుతోంది.

Also Read: Today Gold Rate: కిక్కిచ్చిన బంగారం ధరలు.. ఇవాళ భారీగా తగ్గాయ్.. తులం ఎంతంటే?

Also Read: Ap Aqua -Trump Effect: ఏపీ రైతులపై ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్.. చంద్రబాబు కీలక నిర్ణయాలు

Advertisment
Advertisment
Advertisment