ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ యాప్స్ ప్రమోట్ చేసిన వారిని పోలీసులు అరెస్టు చేసి కటకటాల్లోకి పంపిస్తున్నారు. ఇటీవల 11 మందిపై పంజాగుట్ట పీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. వారిలో హర్షసాయి, విష్ణు ప్రియ, టేస్టీ తేజ, సుప్రీత, పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్, యాంకర్ శ్యామల, రీతూ చౌదరి సహా మరికొందరిపై కేసు నమోదు అయింది.
Also Read: రా కి రా.. సార్ కి సార్..! గ్రోక్ ఏఐ దెబ్బ అదుర్స్ కదూ!
ప్రస్తుతం వారు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. వారి మొబైల్ ఫోన్లు కూడా స్విఛాఫ్ వస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. దీంతో కేసు నమోదు అయిన వారిని వేటాడే పనిలో పోలీసుల ఉన్నారు. ఇందులో భాగంగానే పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ కోసం పోలీసులు వేట మొదలు పెట్టారు. మరోవైపు ఇమ్రాన్ కోసం RTV ఛానెల్ సైతం అన్వేషణ ప్రారంభించింది.
Also Read: పూరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విజయ్ సేతుపతి..!
ఇమ్రాన్ తల్లితో RTV
ఇందులో భాగంగానే RTV బృందం తాజాగా ఇమ్రాన్ ఇంటికి వెళ్లింది. అక్కడ ఇమ్రాన్ తల్లిని అడగగా.. ఆమె తన కొడుకును వెనకేసుకొచ్చింది. తమ కొడుకు ఇంట్లో లేడని.. ఎక్కడికి వెళ్లాడో తెలియదని వెల్లడించింది. అంతేకాకుండా అతడి ఫోన్ నెంబర్ కూడా తమ దగ్గర లేదని తెలిపింది. తన కొడుకు ఇమ్రాన్ చాలా మంచి వాడని.. అతడు మళ్లీ తిరిగి వస్తాడని చెప్పింది.
Also Read: స్పీడ్ పెంచేసిన డ్రాగన్ బ్యూటీ.. మళ్ళీ ఆ హీరోతో రిపీట్..
అక్కడ నుంచి ఇమ్రాన్ ఇంటి సమీపంలో ఉన్న ఒక మెకానిక్‌ని అడగగా.. అతడు సంచలన విషయాలు బయటపెట్టాడు. రీసెంట్‌గా ఇమ్రాన్ పై ఇద్దరు యువతులు కేసు పెట్టారని ఆ మెకానిక్ విస్తుపోయే మరికొన్ని కొత్త విషయాలు తెలిపాడు. హారిక అనే యువతి అతడిపై కేసు పెట్టిందని అతడు చెప్పాడు. ఏవైనా డీలింగ్స్, గొడవలు ఉంటే పక్కనే ఉన్న గ్రౌండ్‌లో సెటిల్ చేసుకుంటాడని తెలిపాడు.
Also Read: అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణవాసుల మృతి..
మరోవైపు అక్కడ ఉన్న 5వ తరగతి బాలుడు ఇమ్రాన్ ఖాన్ గురించి మరిన్ని విషయాలు చెప్పాడు. కొందరు యువతులు డబ్బుల కోసం ఇమ్రాన్ వద్దకు వచ్చి కొట్లాడుకున్నారని ఆ పిల్లగాడు చెప్పాడు. గేమ్స్ ఆడితే డబ్బులు వస్తాయని ఇమ్రాన్ చెప్పేవాడని ఆ బాలుడు తెలిపాడు.