/rtv/media/media_files/2025/03/20/GgKrYimrpadkiDmrvKF7.jpg)
vishwaksen house theft case
హీరో విశ్వక్‌సేన్ (Vishwaksen) ఇంట్లో చోరీ కేసును మూడు రోజుల్లోనే ఛేదించారు పోలీసులు. విశ్వక్ సేన్ సోదరి గది నుంచి బంగారం, డైమండ్ రింగ్స్
చోరీ చేసిన ముగ్గురు దొంగలను ఫిలింనగర్ పోలీసులు అరెస్టు చేశారు. మార్చి 14న విశ్వక్ తండ్రి కరాటే రాజు తమ ఇంట్లో దొంగతనం జరిగిందని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేయగా దొంగలు పట్టుబడ్డారు. సిసి కెమెరాలు, దొంగిలించిన ఇయర్ బడ్స్ లొకేషన్ ఆధారంగా దొంగల లొకేషన్ ట్రేస్ చేశారు. షేక్ పేట నాలా వద్ద డైమండ్ రింగ్స్, ఇతర వస్తువులను విక్రస్తూ దొరికిపోయారు. భీమవరపు స్వరాజ్, బొల్లి కార్తీక్, నేరేడుమల్లి సందీప్ లను నిందితులుగా గుర్తించిన పోలీసులు వారిని అరెస్టు చేసి రిమాండ్ కి తరలించారు. వారి వద్ద నుంచి రెండు డైమండ్ రింగ్స్, 1 ఎలక్ట్రిక్ బైక్, 3 మొబైల్ ఫోన్స్, 1 ఇయర్ బర్డ్స్ స్వాధీనం చేసుకున్నారు.
Also Read : వేసవిలో పెరుగులో ఇవి కలిపి తింటే.. వడదెబ్బకు బై బై
అసలేం జరిగింది..
అయితే ఆదివారం తెల్లవారుజామున విశ్వక్ సేన్ చెల్లి మన్మయి గదిలో వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. దీంతో అనుమానం వచ్చి గదిలోని అల్మారాలను చెక్ చేయగా బంగారం దొంగతనం జరిగినట్లు తెలిసింది. దీంతో ఆమె విషయాన్ని వెంటనే తండ్రి కరాటే రాజుకు చెప్పగా.. ఆయన ఫిలింనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
Also Read : హెచ్-1బీ వీసాలో మార్పులు.. పాత రికార్డులన్నీ తొలగింపు
విశ్వక్ తండ్రి కరాటే రాజు ఫిర్యాదుతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్ సహాయంతో అక్కడ వేలి ముద్రలను సేకరించారు. అనంతరం చుట్టు పక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలించారు. అయితే తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి బైక్ పై వచ్చినట్లు రికార్డ్ అయ్యింది. ఆ తర్వాత నేరుగా గేటు నుంచి వెళ్లి మూడో అంతస్తులోని మన్మయి బెడ్ రూమ్ లో దొంగతనం చేశాడు. 20 నిమిషాల్లో దొంగతనం పూర్తి చేసి అక్కడి నుంచి పరారైనట్లు గుర్తించారు. రెండు డైమండ్ రింగులు, రూ. 2. 20 లక్షల విలువచేసే బంగారం మాయమైనట్లు పోలీసులు తెలిపారు.
Also Read: Mega Star: చిరంజీవికి లైఫ్ ఎచీవ్ మెంట్..యూకే పార్లమెంట్లో ఘన సత్కారం
Also Read : ఎక్స్‌ఏఐ చాట్‌బాట్ బూతులు.. కేంద్రం కీలక నిర్ణయం
Latest Telugu News | Today News In Telugu | Telugu Cinema News | Telugu Film News