Laila Third Single: మాస్ కా దాస్ విశ్వక్ సేన్(Vishwak Sen), యూత్ ఆడియన్స్ టార్గెట్ గా 'లైలా'(Laila) చిత్రంతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ భారీ సెన్సేషన్ సృష్టించింది. విశ్వక్ సేన్ ఈ చిత్రంలో అబ్బాయిగా మాత్రమే కాకుండా, ఒక లేడీ గెటప్ లో కూడా కనిపిస్తారు. రామ్ నారాయణ్ దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మించిన ఈ చిత్రం, ప్రేక్షకులలో భారీ అంచనాలను క్రియేట్ చేసింది.
Also Read: USA: అమెరికాలో విద్యార్థుల విలవిల..క్యాంపస్ లో మాత్రమే ఉద్యోగాలతో ఇబ్బందులు
"కోయ్ కోయ్ కోడ్ని కోయ్.."
'లైలా' మూవీ లో పాటలకి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. 'లైలా' సినిమా ఫస్ట్ సింగిల్ "సోనూ మోడల్"(Sonu Model) వీడియో సాంగ్ చార్ట్ బస్టర్ హిట్‌గా నిలిచింది. జనవరి 23న విడుదలైన 2nd సింగిల్ "ఇచ్చుకుందాం బేబీ" కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా రిలీజైన, 'ఓహో రత్తమ్మా'(Oho Ratthamma) అనే సాంగ్ దుమ్ము దులుపుతుంది. ఈ సాంగ్‌లో రీసెంట్ గా వైరల్ అయిన "కోయ్ కోయ్ కోడ్ని కోయ్" పాటను వాడుకున్నారు, సాంగ్ మధ్యలో వచ్చే ఈ లిరిక్స్ ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. పెంచల్ దాస్ రచించిన ఈ సాంగ్ ఇప్పుడు ఇస్టెంట్ హిట్ గా మారింది . ఈ పాటని 'గోదారి గట్టు' సింగర్ మధుప్రియ పాడారు.
Also Read: USA: ట్రాఫిక్ కంట్రోల్ టవర్ లో సిబ్బంది కొరత...వాషింగ్టన్ ప్రమాదానికి కారణం ఇదే..
విశ్వక్ సేన్ 'వెళ్లి పోమాకే' (Vellipomake) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి, తరువాత అనేక సినిమాలలో తన నటనతో మెప్పించాడు. ప్రస్తుతం 'లైలా'(Laila) చిత్రంతో పాటు 'ఫంకీ' (Funkey) అనే సినిమాలో కూడా నటిస్తున్నారు.
Also Read: పెళ్లి ఆగింది.. ఉద్యోగం పోయింది.. సైఫ్ కేసులో అమాయకుడి జీవితం నాశనం!
Also Read: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. టైర్ పగిలి పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు!