తమిళ స్టార్ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి లీడ్ రోల్ లో నటించిన 'మహారాజా' మూవీ గత ఏడాది విడుదలై భారీ విజయం అందుకున్న విషయం తెలిసిందే. ఎలాంటి అంచనాలు, పెద్దగా ప్రమోషన్స్ లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని విడుదలైన అన్నీ చోట్ల మంచి వసూళ్లను సాధించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఊహించని విజయం సాధించి రూ.100 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టింది. జూన్ 14న విడుదలైన ఈ చిత్రం 50 రోజులపాటు విజయవంతంగా ప్రదర్శితమైంది. తెలుగులో కూడా మహారాజా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచి, రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 20 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. ఇక ఇటీవల ఈ మూవీ చైనాలో రిలీజ్ అయింది. అక్కడి ఆడియన్స్ ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో చైనా బాక్సాఫీస్ వద్ద 'మహారాజ' రికార్డ్ స్థాయిలో వసూళ్లు రాబడుతోంది. #MahaRaja China 🇨🇳 BoxOffice Update: Final : ¥ 77.7M | $10.6M | ₹ 91 CrWorldwide Total - ₹201 Cr pic.twitter.com/hwD3UKwHFf — South Indian BoxOffice (@BOSouthIndian) January 7, 2025 Also Read : 'అన్ స్టాపబుల్' లో తారక్ ప్రస్తావన.. స్పందించిన నాగవంశీ 100 కోట్లకు చేరువలో.. చైనాలో, ఇప్పటి వరకు రూ. 91.55 కోట్ల వసూళ్లను రాబట్టి, 100 కోట్ల మార్కుకు చేరువలో ఉంది. గడిచిన ఐదేళ్లలో చైనాలో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా ఈ మూవీ సరికొత్త రికార్డులను సృష్టించింది. ఈ కలెక్షన్స్ తో ఏకంగా 'బాహుబలి 2' రికార్డ్స్ ను బ్రేక్ చేసింది. అంతేకాదు. చైనాలో టాప్-10 హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రాల జాబితాలో చేరిన ఒకే ఒక్క దక్షిణాది సినిమా కూడా ఇదే కావడం గమనార్హం. చైనాలో అమీర్ ఖాన్ నటించిన 'దంగల్' రూ. 1480 కోట్లతో అత్యధిక వసూళ్లను రాబట్టిన భారతీయ చిత్రం కాగా, ఇప్పుడు మహారాజా రూ. 92 కోట్ల కలెక్షన్లతో పదో స్థానంలో నిలిచింది. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి 2 చైనాలో రూ. 80 కోట్ల వసూళ్లను సాధించగా, 'మహారాజా' దానిని అధిగమించి చైనాలో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన ఏకైక సౌత్ మూవీగా సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేసింది. Also Read : ఆస్కార్ బరిలో అట్టర్ ప్లాప్ సినిమా.. నెట్టింట ట్రోల్స్