/rtv/media/media_files/2025/03/06/GhLYeSWsQWlUIVr8mOLs.jpg)
vijay devarakonda as bigg boss host
Bigg Boss 9: బుల్లితెరపై అత్యంత ప్రేక్షకాదరణ పొందిన బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్. ఇప్పటికీ 8 సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ 9వ సీజన్ కి సిద్ధమవుతోంది. త్వరలోనే ప్రారంభం కాబోతున్న సీజన్ 9.. గత సీజన్స్ తో పోలిస్తే మరింత రసవత్తరంగా ఉండబోతున్నట్లు. ఇప్పటికే మేకర్స్ కంటెస్టెంట్ల ఎంపిక చేసే పనిలో ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో బిగ్ బాస్ సీజన్ 9 హోస్ట్ కి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వైరల్ అవుతోంది.
/rtv/media/media_files/2025/03/06/eiY6JN2bPjUjPSmPhGnr.png)
హోస్టుగా విజయ్ దేవరకొండ
సీజన్ 1 ఎన్టీఆర్, సీజన్ 2 నాని హోస్ట్ చేయగా.. మూడవ సీజన్ నుంచి ఇప్పటి వరకు కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తూ వస్తున్నారు. అయితే సీజన్ 9 హోస్టుగా మరో యంగ్ హీరో అలరించబోతున్నట్లు తెలుస్తోంది. స్టార్ హీరో విజయ్ దేవరకొండ బిగ్ బాస్ 9 హోస్టింగ్ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా, దీనికి సంబంధించి బిగ్ బాస్ నుంచి ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు. అయినప్పటికీ సోషల్ మీడియాలో ఈ వార్త తెగ వైరల్ అవుతోంది. ఒకవేళ నిజంగానే విజయ్ హోస్ట్ చేస్తే ఎలా ఉంటుందా? అని ఆయన ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే.. బిగ్ బాస్ సీజన్ 8 విజేతగా సీరియల్ నటుడు నిఖిల్ ట్రోఫీ గెలుచుకున్నాడు. వైల్డ్ కార్డు గా ఎంట్రీ ఇచ్చిన గౌతమ్ కృష్ణ రన్నరప్ గా నిలిచాడు.
Also Read: DIL Raju: విజయ్ సినిమాపై నోరు జారిన దిల్ రాజ్.. వెంటనే సోషల్ మీడియాలో అనౌన్స్మెంట్