Vijay Antony: తప్పెవరిది? సేమ్ టైటిల్ పై స్పందించిన విజయ్ ఆంటోనీ!

హీరో విజయ ఆంటోనీ సేమ్ సినిమా టైటిల్ పెట్టడం పై క్లారిటీ ఇచ్చారు. విజయ్ ఆంటోనీ పిక్చర్స్ బ్యానర్ పై గతేడాది జూలైలోనే తాను 'పరాశక్తి' అనే టైటిల్ రిజిస్టర్ చేసుకున్నట్లు తెలియజేశారు. అందుకు సంబంధించిన అధికారిక పత్రాన్ని కూడా షేర్ చేశారు.

New Update
title

Vijay Antony Movie Title Parashakthi

Vijay Antony: విజయ్ ఆంటోనీ, శివకార్తికేయన్(Sivakarthikeyan) ఇద్దరు హీరోలు తమ సినిమాలకు ఒకే టైటిల్ అనౌన్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది.ఇద్దరు హీరోలు ఒకే టైటిల్ తో సినిమా చేయడంతో ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. అయితే తాజాగా హీరో విజయ్ ఆంటోనీ తాను  'పరాశక్తి'(Parashakthi) టైటిల్ పెట్టడంపై క్లారిటీ ఇచ్చారు. విజయ్ ఆంటోనీ పిక్చర్స్ బ్యానర్ పై గతేడాది జూలైలోనే తాను  టైటిల్ రిజిస్టర్ చేసుకున్నట్లు తెలియజేశారు.  అలాగే తెలుగులోనూ పరాశక్తి అనే టైటిల్ ఉపయోగించుకునేందుకు సౌత్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ పర్మిషన్ ఇచ్చినట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన అధికారిక పత్రాన్ని కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. అరుణ్ ప్రభు తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని విజయ్ ఆంటోనీ నిర్మిస్తున్నారు. 

హైప్ కోసమే 

మరోవైపు హీరో శివకార్తికేయన్ సినిమా కూడా ఇదే  టైటిల్ తో రూపొందుతోంది. సినిమా పేరును ముందే రిజిస్టర్ చేసినప్పటికీ పలువురు విజయ్ ఆంటోనీని తప్పు పట్టారు. కేవలం సినిమా హైప్ కోసమే అదే టైటిల్ కావాలని పెట్టారు అని అన్నారు. ఈ క్రమంలో విజయ్ క్లారిటీ ఇచ్చారు. మరి ఈ టైటిల్ వివాదం ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి. శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న 'పరాశక్తి' చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. దాదాపు రూ. 150 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఈ చిత్రం తమిళం, తెలుగు భాషల్లో ఇది విడుదల కానున్నట్లు తెలియజేస్తూ మేకర్స్ టైటిల్ గ్లిమ్ప్స్ విడుదల చేశారు. 

Also Read: Vijay Sethupathi: తమిళంలో పాన్‌ కార్డు మార్చాలి.. స్టార్‌ హీరో రిక్వెస్ట్ .. ఎందుకిలా?

Also Read: Suryapet Murder: చంపింది నాన్నమ్మనే.. ప్రైవేట్‌ పార్ట్స్‌ను కసితీరా తొక్కి.. భార్గవి సంచలన నిజాలు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు