/rtv/media/media_files/2025/02/24/dILqxYIminBJOqtMQcMn.jpg)
Chhaava Telugu Version
Chhaava Telugu Version: లక్ష్మణ్ ఉటేకర్(Laxman Utekar) దర్శకత్వంలో మరఠా యోధుడు ఛత్రపతి మహారాజ్ శివాజీ(Maratha Warrior Chhatrapati Maharaj Shivaji) కొడుకు శంభాజీ(Shambhaji) జీవిత కథ ఆధారం తీసిన సినిమా ఛావా. ఈ మూవీ ఫిబ్రవరి14న రిలీజై కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్(Vicky Kaushal) , రష్మిక మందన్న(Rashmika Mandanna) హీరో, హీరోయిన్ల గా ఈ సినిమాలో నటించారు.
Also Read: Tamilanadu: నటి పై రాజకీయ నేత అత్యాచారం.. ఏడుసార్లు అబార్షన్..కోర్టు సంచలన తీర్పు!
ప్రస్తుతం హిందీ వెర్షన్ లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ మూవీకి తెలుగు ఆడియన్స్ కూడా బాగా కనెక్ట్ అయ్యారు కాబట్టి ఈ మూవీ తెలుగు వెర్షన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు తెలుగు ప్రేక్షకులు. కానీ చావా చిత్ర బృందం పట్టించుకోవటం లేదు. ఒకేసారి తెలుగు హిందీ లో విడుదల అవుతుంది అనుకున్న వారికి నిరాశే మిగులుస్తూ కేవలం హిందీ వెర్షన్‌ను విడుదల చేసారు. డబ్బింగ్ వెర్షన్ ని జనాలు కోరుకుంటున్నా సరే పట్టీ పట్టనట్టు వ్యవహరిస్తోంది మూవీ యూనిట్.
ఇందుకు కారణం లేకపోలేదు. శంభాజీ మహారాజ్ అనేది మరాఠా వీరుడి కథ. ఉత్తర భారతీయ రాష్ట్రాల్లో తప్ప, ఇతర ప్రాంతాల్లో ఈ సినిమాకు ఆదరణ ఉంటుందా లేదా అనే సందేహంతో, నిర్మాతలు వెనక్కి తగ్గారు.
రిస్క్ తీసుకోకుండా..!
అందుకే, రిస్క్ తీసుకోకుండా చావాని డబ్ చేయకుండా వదిలేశారు. వాస్తవానికి తెలుగులో కూడా డబ్ చేసి ఉంటే అంత సక్సెస్ అవుతుందో లేదో చెప్పలేం అందుకు ఉదాహరణకి, గతంలో జోధా అక్బర్, బాజీరావు మస్తానీ వంటి సినిమాలు హిందీలో పాపులర్ అయినప్పటికీ, ఇతర భాషలలో అంత పెద్ద ఆదరణ పొందలేదు. అలాగే తానాజీ కూడా హిందీ లో మాత్రమే పాపులర్ అయ్యింది.
Also Read: Champions Trophy: ఎడారి దేశంలో...దాయాది పోరులో రికార్డుల మోత
ఛావా నిర్మాణ సంస్థ మాడాక్ గతంలో నిర్మించిన స్త్రీ 2 కూడా డబ్బింగ్ అవ్వలేదు. ఆ సినిమా వందల కోట్ల వసూళ్లు సాధించినప్పటికీ, డబ్బింగ్ ఆలోచన మాత్రం పెట్టుకోలేదు ప్రొడ్యూసర్స్.
విక్కీ కౌశల్, రష్మిక మందన్న కంబోలో వచ్చిన ఈ హిస్టారికల్ డ్రామా 500 కోట్లకు పైగా వసూలు దిశగా దూసుకెళ్తోంది. పోటీ కి సినిమాలు ఏమీ లేకపోవడంతో కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది చావా.