/rtv/media/media_files/2025/02/07/y0SKkEIDPjSeeMOc0baY.jpg)
Sankranti Ki Vastunnam OTT
Sankranti Ki Vastunnam OTT: ఈ సంక్రాంతికి, దిల్ రాజు(Dil Raju) రెండు పెద్ద చిత్రాలు రిలీజ్ చేశారు - గేమ్ ఛేంజర్(Game Changer), సంక్రాంతికి వస్తున్నాం. రామ్ చరణ్(Ram Charan) నటించిన గేమ్ ఛేంజర్ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ అవ్వలేదు, ఇప్పుడు అది అమెజాన్ ప్రైమ్ వీడియోలో(Amazon Prime Video) స్ట్రీమింగ్ అవుతోంది. ఇక, సంక్రాంతికి వస్తున్నం OTT రిలీజ్ ఇంకొంత ఆలస్యం అవ్వొచ్చని సమాచారం.
Also Read: Mastan Sai : డ్రగ్స్ ఇస్తాడు.. న్యూడ్ వీడియోలు తీస్తాడు.. మస్తాన్ మాములోడు కాదయ్యా!
ZEE5 ఈ చిత్రానికి డిజిటల్ హక్కులు తీసుకుంది, మరి ఈ చిత్రం మార్చిలో OTTలో ప్రీమియర్ కావొచ్చని తెలుస్తోంది. మొదట్లో చాలా మంది ఈ మూవీ థియేటర్లలో విడుదలైన ఒక నెలలో OTTలో వచ్చేస్తుంది అనుకున్నారు, కానీ మూవీ టీం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.
Also Read: Sekhar Basha: శేఖర్ బాషాకు బిగ్ షాక్.. మరో కేసు నమోదు..
రూ. 300కోట్లకు పైగా కలెక్షన్స్..
ఇప్పటికే సంక్రాంతికి వస్తున్నాం మూవీ రూ. 300కోట్లకు పైగా వసూల్ సాధించి సూపర్ హిట్ గా నిలిచింది. రిలీజ్ అయినప్పటి నుండి అన్ని ఏరియాల్లో మంచి కలెక్షన్స్ సొంతం చేసుకుంది. మంచి కామెడీతో ప్రేక్షకులను ఫుల్ గా నవ్వించాడు మన వెంకీ మామ. అలాగే ఐశ్వర్య రాజేష్ కూడా తన నటనతో ఆకట్టుకుంది. అనిల్ ఈ సినిమాతో ఇంకో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం కొన్ని ఏరియాల్లో ఇంకా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో థియేటర్స్ లో దూసుకుపోతుంది.
Also Read: గిరిజన యువతులు నల్లగా, అంద వికారంగా.. ఒడిశా సీఎం చీప్ కామెంట్స్!
అయితే, సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5 సొంతం చేసుకుంది. త్వరలోనే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను ప్రకటించనుంది మూవీ యూనిట్. సంక్రాంతికి వచ్చిన మూవీస్ అన్నింటిని వెన్నకి నెట్టి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ నైజంలో కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఒక్క నైజాంలోనే దాదాపు 40 కోట్ల లాభం సాధించింది అని ప్రొడ్యూసర్స్ తెలిపారు.