Urvashi Rautela: సైఫ్ అలీఖాన్ పై దాడి ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి చొరబడిన దుండగులు ఆయనను కత్తితో పొడిచి పారిపోయారు. దాడిలో తీవ్రంగా గాయపడిన సైఫ్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన పై ఎంతోమంది సినీ, రాజకీయ ప్రముఖులు స్పందిస్తూ ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.
🇮🇳 "A man almost died—look at my jewelry."
— shivvayaa (@shivvayaa) January 18, 2025
Urvashi Rautela sparks outrage over her tone-deaf remarks about Saif Ali Khan's stabbing incident.
Fans criticize her focus on jewelry over the actor's condition. pic.twitter.com/nhc7aNaXZD
సైఫ్ సర్ క్షమించండి!
ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బాలీవుడ్ నటి ఊర్వశినీ సైఫ్ దాడి గురించి అడగ్గా.. ఆ సమయంలో ఆమె మాట్లాడిన తీరుపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెలువెత్తాయి. దీంతో ఈ విషయంపై తాజాగా ఊర్వశీ సైఫ్ కు క్షమాపణలు చెప్పారు. 'సైఫ్ సర్.. మీకు ఈ మెసేజ్ చేరుతుందని ఆశిస్తున్నాను. మీ గురించి మాట్లాడే సమయంలో నేను ప్రవర్తించిన తీరుకు విచారం వ్యక్తం చేస్తున్నాను. ఆ ఇంటర్వ్యూ ఇచ్చే సమయంలో మీపై జరిగిన దాడి తీవ్రత గురించి నాకు తెలియదు. గత కొన్ని రోజులుగా 'డాకు మహారాజ్' సక్సెస్ లో ఉన్నాను. అందువల్ల ఆ సమయంలో నాకు వచ్చిన బహుమతుల గురించి మాట్లాడాను. అలా చేసినందుకు సిగ్గుపడుతున్నాను.. నన్ను క్షమించండి. దాడి తీవ్రత తెలిశాక చాలా బాధపడ్డాను.. ఆ సమయంలో మీ దైర్యం నిజంగా ప్రశంసనీయం.. మీపై ఇంకా గౌరవం పెరిగింది అంటూ పోస్ట్ పెట్టారు ఊర్వశీ.
ఇంటర్వ్యూలో ఊర్వశీ ఏం మాట్లాడింది?
అయితే ఊర్వశీ ఇంటర్వ్యూలో డాకు మహారాజ్ సక్సెస్ తో తనకు వచ్చిన బహుమతులను సైఫ్ దాడికి ముడిపెట్టడంతో విమర్శలు ఎదుర్కుంది. ఊర్వశీ మాట్లాడుతూ.. 'సైఫ్‌పై దాడి దురదృష్టకరం'. నేను నటించిన డాకు మహారాజ్ సినిమా ఇప్పటివరకు రూ.150కోట్లు వసూళ్లు సాధించింది. దీంతో మా అమ్మ నాకు డైమండ్ రింగ్ గిఫ్ట్ గా ఇచ్చింది. నాన్న రోలెక్స్ వాచ్ ఇచ్చారు. కానీ వీటిని బహిరంగంగా వేసుకునే పరిస్థితి లేదు. మనపై కూడా అలా ఎవరైనా దాడి చేస్తారనే భయం ఉంటుంది అని అన్నారు. దీంతో నెటిజన్లు ఒక నటుడి పరిస్థితి కంటే నగల పై మీ దృష్టి ఎక్కువగా ఉందంటూ ట్రోల్స్, కామెంట్స్ చేశారు.
Also Read : వంద కోట్ల క్లబ్ లో 'సంక్రాంతికి వస్తున్నాం'.. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్