'గేమ్ ఛేంజర్' రివ్యూ ఇస్తే మా ఇంటిపై దాడి చేస్తున్నారు.. సినీ క్రిటిక్ ఆవేదన

సినీ క్రిటిక్ ఉమైర్ సంధు 'గేమ్ ఛేంజర్' మూవీకి నెగిటివ్ రివ్యూ ఇస్తూ పోస్ట్ పెట్టారు. దానికి ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. అయితే ఆయన మరో పోస్ట్ లో..' గేమ్‌ ఛేంజర్ కి నెగటివ్‌ రివ్యూలు ఇచ్చినందుకు, ఏపీ లోని నా మామయ్య ఇంటిపై పోలీసులు దాడి చేశారని పేర్కొన్నారు.

New Update
umair sandhu review on game changer

ram charan umair sandhu

ఓవర్సీస్‌ సెన్సార్‌ బోర్డు సభ్యుడిగా తనను తాను పరిగణించే ఉమైర్‌ సంధు మరోసారి వార్తల్లో నిలిచారు. సోషల్ మీడియా వేదికగా రామ్ చరణ్‌ నటించిన గేమ్‌ ఛేంజర్ సినిమాపై తన మొదటి రివ్యూ అంటూ పోస్ట్‌ చేశారు. ఈ రివ్యూ సినిమాకి కంప్లీట్ నెగిటివ్ గా ఉంది.' శంకర్ షణ్ముఖం 90 కాలం నాటి చెత్త పొలిటికల్ సినిమాలు చూసి విసిగిపోయాం. మొదట ఇండియన్ 2. ఇప్పుడు గేమ్ ఛేంజర్. 

Also Read : 'రాజాసాబ్' పై అంచనాలు పెట్టుకోకుండా ఉంటే బెటర్.. థమన్ షాకింగ్ కామెంట్స్

ఈ మూవీ ఒక టార్చర్. రామ్ చరణ్, కమల్ హాసన కెరీర్ నాశనం చేశావ్. గేమ్ ఛేంజర్ రైటింగ్ ఏమాత్రం బాలేదు. ఫ్లాప్ పాటలు, బోరింగ్ స్క్రీన్ ప్లే. ఈ చెత్త సినిమా కోసం రూ.500 కోట్లు ఖర్చు చేసినందుకు మేకర్స్ సిగ్గుపడాలి. రిటైర్ అయిపో శంకర్..' అంటూ తన రివ్యూలో పేర్కొన్నాడు. ఈయన పోస్ట్ రామ్ చరణ్‌ అభిమానుల కోపానికి దారి తీసింది. 

Also Read : 'పుష్ప' చీటింగ్.. మూవీ టీమ్ పై నెటిజన్స్ ఫైర్

దీంతో 'గేమ్‌ ఛేంజర్' పై ఉమైర్‌ చేసిన పోస్టులకు ఫ్యాన్స్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఇతను కేవలం ఫేమస్ అవ్వడానికే రివ్యూలు ఇస్తాడని..మొన్న 'పుష్ప 2' పై కూడా ఇలానే ఇచ్చాడని.. ఇపుడు కొత్తగా 'గేమ్ ఛేంజర్' సినిమాపై కూడా నెగిటివ్ రివ్యూలు ఇస్తున్నాడని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

అయితే తాజాగా, ఉమైర్‌ సంధు మరో పోస్ట్ చేస్తూ..' గేమ్‌ ఛేంజర్ సినిమాపై నెగటివ్‌ రివ్యూలు ఇచ్చినందుకు, ఆంధ్రప్రదేశ్‌లోని నా మామయ్య ఇంటిపై పోలీసులు, ప్రభుత్వ ప్రతినిధులు దాడి చేశారు..' అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉమైర్‌ సంధు చేసిన ట్వీట్లు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు