Trisha: స్టార్ హీరోయిన్ త్రిష పెళ్లి వార్త ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. 41ఏళ్ళ ఈ బ్యూటీ ఇంకా పెళ్లి చేసుకోలేదని అందరికీ తెలిసిన విషయమే. కాగా, తాజాగా ఈమె సోషల్ మీడియాలో చేసిన ఆసక్తి రేపుతోంది. పట్టుచీరలో పెళ్లి కూతురులా ముస్తాబైన ఆమెకు ఎవరో మల్లెపూలు పెడుతున్నట్లుగా ఫోటోను షేర్ చేసింది. దీనికి తోడు 'ప్రేమ ఎప్పటికీ గెలుస్తుంది' అంటూ ఓ క్యాప్షన్ పెట్టడం చర్చకు దారితీసింది. దీంతో త్రిష పెళ్లి చేసుకోబోతుందా? ఇది ఎంగేజ్మెంట్ కి సంబంధించిన ఫోటోనా..? త్వరలోనే పెళ్లి వార్త అనౌన్స్ చేయనుందా? అంటూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.
ఏ మాత్రం తగ్గని క్రేజ్
ఇండస్ట్రీకొచ్చి 20 ఏళ్ళు గడిచిన త్రిష క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అదే అందం, అదే నటనతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. రెండు జనరేషన్స్ తో నటించిన స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. చాలా సెలెక్టీవ్ గా సినిమాలు చేసుకుంటూ ముందుకెళ్తోంది. ఇటీవల విదాముయార్చి, ఐడెంటిటీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం గుడ్ బ్యాడ్ అగ్లీ, థగ్ లైఫ్, సూర్య 45, రామ్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఓ వైపు సినిమాలు చేస్తూనే .. మరోవైపు ఓటీటీ కంటెంట్ తోనూ అలరిస్తోంది త్రిష. రీసెంట్ గా 'బృందా ' సిరీస్ తో ఓటీటీ ప్రియులను ఆకట్టుకుంది.
telugu-news | cinema-news | latest-news | actress-trisha