2024 తెలుగు చిత్ర పరిశ్రమకు మంచి ఊపు ఇచ్చిందనే చెప్పాలి. డిజాస్టర్ చిత్రాలు కొన్ని ఉన్నప్పటికీ, కల్కి, పుష్ప 2, దేవర వంటి చిత్రాలు టాలీవుడ్‌కు పెద్ద విజయాలను అందించాయి. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రాలు భారీ వసూళ్లను నమోదు చేసి, పరిశ్రమకు బిగ్ బూస్ట్‌ను అందించాయి. ఈ విజయాల నుంచి పొందిన ఉత్సాహంతో, 2025లో కూడా ఇదే జోరు కొనసాగుతుందని సినీ వర్గాల్లో ఆశాభావం వ్యక్తమవుతోంది. అందుకు అనుగుణంగా 2025లో విడుదలకు సిద్ధంగా ఉన్న క్రేజీ ప్రాజెక్ట్స్ ఏంటి? బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సాధించే ఛాన్స్ ఉన్న చిత్రాలపై ఓ లుక్కేద్దాం.. గేమ్ ఛేంజర్ 2025 'గేమ్ ఛేంజర్' తో మొదలు కానుంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ - శంకర్ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10 న ప్రేక్షకుల ముందుకు రానుంది. దిల్ రాజు పాన్ ఇండియా స్థాయిలో నిర్మించిన ఈ చిత్రంపై ఇప్పటికే అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. మరి ఈ మూవీ 2025 టాలీవుడ్ లో ఫస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందేమో చూడాలి. Also Read: అభిమానులకు 'KGF' హీరో బహిరంగ లేఖ.. అందులో ఏముందంటే? డాకు మహారాజ్ బాలయ్య కూడా సంక్రాంతికే 'డాకు మహారాజ్' అంటూ వస్తున్నాడు. బాబీ డైరెక్ట్ చేసిన ఈ సినిమా జనవరి 12న విడుదల కాబోతుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసింది. సంక్రాంతికి వస్తున్నాం వెంకీమామ 2025 స్టార్టింగ్ లోనే సక్సెస్ కొట్టి కంబ్యాక్ ఇవ్వాలని 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. ఆయన గత సినిమా 'సైంధవ్' డిజాస్టర్ గా నిలిచింది. దీంతో ఈసారి తనకు కలిసొచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో వస్తున్నారు. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమా జనవరి 14 న రిలీజ్ కానుంది. తండేల్ నాగ చైతన్య - సాయి పల్లవి జంటగా నటించిన 'తండేల్' ఫిబ్రవరి 7 న రాబోతుంది. శ్రీకాకుళంలో జరిగిన రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా తీస్తున్న ఈ సినిమాపై ఆడియన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే టీజర్, సాంగ్స్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది. చందూ మొండేటి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం చైతూ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో రూపొందుతుంది. Also Read: మరో వివాదంలో చిక్కుకున్న మంచు ఫ్యామిలీ కుబేర తెలుగు స్ట్రైట్ మూవీ 'సార్' తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కోలీవుడ్ స్టార్ ధనుష్ 2025 లో 'కుబేర' అంటూ వస్తున్నాడు. శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో కింగ్ నాగార్జున, రష్మిక మందన ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ముంబై బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫిబ్రవరి 21 న రిలీజ్ కానుంది. అలాగే నితిన్ 'తమ్ముడు' మూవీ కూడా పిబ్రవరి 24 న వస్తుంది. హరిహర వీరమల్లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'హరిహర వీరమల్లు' మార్చ్ 28 న విడుదల కానుంది. 'బ్రో' సినిమా తర్వాత పూర్తి రాజకీయాలతో పవన్ బిజీ అయిపోయారు. ఎన్నికల్లో గెలిచి డిప్యూటీ సీఎం కూడా అయ్యారు. అయితే 2025 లో ఆయన నుంచి రెండు సినిమాలు రాబోతున్నాయి. అందులో మొదటగా 'వీరమల్లు'.. ఆ తర్వాత సుజిత్ డైరెక్ట్ చేస్తున్న 'ఓజీ' కూడా అదే ఏడాది ఉండబోతోంది. రాజా సాబ్ ఈ ఏడాది 'కల్కి' తో పాన్ ఇండియా హిట్ అందుకున్న ప్రభాస్ 2025 లో మరో రెండు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ను దింపుతున్నాడు. అందులో మొదటిది 'రాజాసాబ్'. మారుతి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 10 న విడుదల కానుంది. ఈ మూవీతో పాటూ హను రాఘవపూడి తో చేస్తున్న ప్రాజెక్ట్ కూడా 2025 ఇయర్ ఎండింగ్ కు రానుంది. మిరాయ్ 2024 లో 'హనుమాన్' తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ సక్సెస్ అందుకున్న యంగ్ హీరో తేజ సజ్జా నుంచి 2025 లో మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'మిరాయ్' రానుంది. సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 18 న థియేటర్స్ లో విడుదల కానుంది. అదే రోజు అనుష్క 'ఘాటీ' కూడా వస్తోంది. 'మిరాయ్' తో పాటూ అదే నెల అంటే ఏప్రిల్ చివరి వారంలో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' కూడా థియేటర్స్ లో సందడి చేయనుంది. విశ్వంభర మెగాస్టార్ చిరంజీవి - వశిష్ట కాంబోలో తెరకెక్కుతున్న సోషియో ఫాంటసి డ్రామా 'విశ్వంభర' 2025 సంక్రాంతికే రావాల్సింది. కానీ రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' వల్ల సమ్మర్ కు పోస్ట్ పోన్ అయింది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రాన్ని మే నెలలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. 'విశ్వంభర' తో పాటూ మాస్ మహారాజ రవితేజ 'మాస్ జాతర' మూవీ కూడా మే 9 న వస్తోంది. వార్ 2 ఈ ఇయర్ 'దేవర' తో పాన్ ఇండియా హిట్ కొట్టిన జూనియర్ ఎన్టీఆర్.. 2025 లో 'వార్ 2' మూవీతో రానున్నారు. ఈ సినిమాతోనే తారక్ బాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నారు. ఇందులో హృతిక్ రోషన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. యాక్షన్ స్పై డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్టు 15 న విడుదల కానుంది. ఇవి కాకుండా కాంతారా' చాప్టర్-1, రజనీకాంత్ 'కూలీ', సూర్య 44, అజిత్ కుమార్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ', యశ్ 'టాక్సిక్', కమల్ హాసన్ 'థగ్ లైఫ్' సల్మాన్ ఖాన్ సికందర్' చిత్రాలు కూడా వచ్చే ఏడాదిలోనే విడుదల అవుతున్నాయి.