KP Chowdhary:
రజినీకాంత్ ‘కబాలి’ సినిమా తెలుగు నిర్మాత కేపీ చౌదరి (కృష్ణ ప్రసాద్ చౌదరి) ఇవాళ ఆత్మహత్య చేసుకున్నాడు. డ్రగ్స్ వ్యవహారంలో పీకల్లోతులో మునిగి విమర్శల పాలైన ఆయన గోవాలో సూసైడ్ చేసుకున్నాడు. అయితే ఆయన తీవ్ర అనారోగ్య కారణాలు, ఆర్థిక ఇబ్బందులతో సూసైడ్‌కు పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: పార్లమెంట్ ను కుదిపేసిన కుంభమేళా తొక్కిసలాట
కేపీ చౌదరి 2016లో చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు. రజినీకాంత్ ‘కబాలి’ సినిమా తెలుగు వెర్షన్‌కు నిర్మాతగా వ్యవహరించాడు. ఇక నిర్మాతగానే కాకుండా అనేక తెలుగు, తమిళ సినిమాలకు డిస్ట్రిబ్యూటర్‌గా కూడా చేశాడు. అర్జున్ సురవరం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సర్దార్ గబ్బర్ సింగ్ వంటి సినిమాలను కేపీ చౌదరి డిస్ట్రిబ్యూట్ చేశాడు. అయితే అతడికి సినీ ఇండస్ట్రీ అంతగా కలిసి రాలేదనే చెప్పాలి.
Also Read: రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ఇకపై ఆ వందే భారత్‌లో నాన్ వెజ్ నిషేధం
దీంతో అతడు డ్రగ్స్ దందాలోకి దిగాడు. ఈ క్రమంలోనే గోవాలో ఓహెచ్ఎం పబ్‌ను ప్రారంభించాడు. అక్కడ పలు సెలబ్రిటీలకు డ్రగ్స్ సరఫరా చేసేవాడు. ఇక అందులో కూడా నష్టాలు రావడంతో తిరిగి హైదరాబాద్‌కు వచ్చేశాడు. ఇక్కడ గతంలో అతడిపై డ్రగ్స్ కేసు నమోదైన విషయం తెలిసిందే. దీంతో నార్సింగి పోలీసులు అతడిని డ్రగ్స్ కేసులో అరెస్ట్ కూడా చేశారు.
Also Read: మా సిబ్బంది వారానికి 120 గంటలు పని చేస్తున్నారు.. ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు
అతడు వరలక్ష్మి టిఫిన్ డ్రగ్స్ కేసులో నిందితుడుగా ఉన్నాడు. అంతేకాకుండా అతడు ఎంతో మంది సినీ సెలబ్రిటీలకు డ్రగ్స్ సరఫరా చేసినట్లు తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఇలా పలు కేసుల్లో కేపీ చౌదరి తీవ్ర విమర్శలతో కుంగిపోవడమే కాకుండా.. ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో అతడు ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.
Also Read: యూఎస్ఏఐడీ పై మండిపడుతున్న ట్రంప్ అండ్ మస్క్..ఎందుకో తెలుసా!