Naga Chaitanya: బ్రేకప్ బాధేంటో నాకు తెలుసు.. సమంతతో విడాకులపై కన్నీరు పెట్టించే చైతూ వీడియో!

సమంతతో విడాకులపై నాగచైతన్య మరోసారి స్పందించాడు. విడాకుల నిర్ణయం రాత్రికిరాత్రి తీసుకుంది కాదన్నాడు. ఎన్నోరోజులు చర్చించుకున్నాకే విడిపోవాలని నిర్ణయించుకున్నామని తెలిపాడు. బ్రేకప్ బాధేంటో తనకు తెలుసని.. తనపై నెగెటివ్ కామెంట్స్ ఆపేయండని విజ్ఞప్తి చేశాడు.

New Update
Naga Chaitanya interesting comments on his divorce with Samantha

Naga Chaitanya react on his divorce with Samantha

సమంత - చైతు.. ఒకప్పుడు టాలీవుడ్ మోస్ట్ లవ్ కపుల్‌‌లో వీరు ఒకరు. ఎన్నో ఏళ్లు ప్రేమించుకున్న ఈ జంట.. ఆ తర్వాత పెళ్లి బంధంతో ఒక్కటైంది. అలా పెళ్లైన నాలుగేళ్ల వరకు హ్యాపీగా, జాలీగా కలిసి ఉన్నారు. ఈ లవ్ కపుల్‌ని చూసి సినీ ప్రియులు, అభిమానులు తెగ ముచ్చటపడేవారు. కానీ ఊహించని విధంగా ఈ జంట విడాకులు తీసుకుని హార్ట్ బ్రేక్ చేసుకుంది. 

Also Read: ముఖ్యమంత్రి చంద్రబాబు- నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరీ మధ్య ఆసక్తికర చర్చ ..

అప్పటి నుంచి వీరిద్దరి వార్తలు హెడ్ లైన్స్‌గా మారాయి. ఇక వీరు ఎందుకు విడిపోయారో ఇప్పటికి ఎవ్వరికీ తెలియదు. కానీ సామ్-చైతు విడాకులకు సంబంధించిన గాసిప్స్ మాత్రం జోరుగా సాగుతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్పుకొస్తున్నారు. ఒకరేమో నాగచైతన్యదే తప్పు అంటుంటే.. మరికొందరేమో సమంతదే తప్పు అంటూ గుసగుసలాడుకుంటున్నారు. కానీ అసలు విషయం మాత్రం సామ్ - చైతుకి తప్పించి మరెవరికీ తెలియదు. 

Also Read: సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికలపై బిగ్ అప్డేట్.. ఫిబ్రవరి 15 లోగా పూర్తి చేయాలని ఎస్‌ఈసీ కీలక ఆదేశాలు

ఎన్నో రోజులు చర్చించుకున్నాం

అయితే వీరిద్దరి విడాకులపై రకరకాల వార్తలు బయటకొచ్చినపుడల్లా నాగచైతన్య వివరణ ఇస్తూనే ఉన్నాడు. తామిద్దరి అండర్‌స్టాండింగ్ కారణంగానే విడిపోయినట్లు చెప్పుకొచ్చాడు. అయితే మరోసారి సమంతతో విడాకులపై చైతూ ఓపెన్ అయ్యాడు. ఓ ఇంటర్వ్యూలో చైతు నోరు విప్పాడు. విడాకుల నిర్ణయం రాత్రికి రాత్రి తీసుకుంది కాదని అన్నాడు. ఎన్నో రోజులు చర్చించుకున్న తర్వాత.. విడిపోవాలని నిర్ణయించుకున్నాము అని నాగచైతన్య చెప్పాడు.

Also Read: విజయసాయికి కేతిరెడ్డి కౌంటర్.. ఆ విషయం అందరికీ తెలుసంటూ సంచలన ట్వీట్!

బ్రేకప్ బాదేంటో నాకు తెలుసు

బ్రేకప్ బాధేంటో తనకు బాగా తెలుసునని.. తనపై నెగెటివ్ కామెంట్స్ చేయడం ఆపేయండి అంటూ పేర్కొన్నాడు. తమ విడాకుల అంశం ఇతరులకు వినోదంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశాడు. తమ విడాకుల అంశంపై ఎన్నో గాసిప్స్ రాశారని.. నెగెటివ్ కామెంట్లు చేసేవారు ఇకనైనా వాటిని ఆపేయాలి విజ్ఞప్తి చేశాడు. ప్రస్తుతం నాగచైతన్య వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. మరి ఇప్పటికైనా నెటిజన్ల రూమర్స్‌కి చెక్ పడుతుందో లేదో చూడాలి. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు