This Week Ott Movies: ఈ వారం మరో కొత్త కంటెంట్ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాయి ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్. ఇంట్లోనే వినోదాన్ని పంచేందుకు బోలెడు సినిమాలు, సీరీస్ లు వచ్చేస్తున్నాయి. అలాగే బిగ్ స్క్రీన్ లవర్స్ కోసం కూడా పలు ఆసక్తికర సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ వారం ఓటీటీ, థియేటర్ సినిమాలు లిస్ట్ ఏంటో ఇక్కడ చూడండి.
ఓటీటీ, థియేటర్స్ లో ఫుల్ ఎంటర్ టైన్మెంట్
'జాట్'
గోపి చంద్ మలినేని దర్శకత్వంలో సన్నీ దేవోల్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'జాట్'. ఈ చిత్రం కూడా ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. గోపీచంద్ గత చిత్రాల మాదిరిగానే ఇందులోనూ యాక్షన్, పవర్‌ఫుల్ డైలాగ్స్ హైలైట్ గా ఉండనున్నాయి.
'జాక్'
డీజే టిల్లు బ్లాక్ బస్టర్ తర్వాత సిద్దూ జొన్నలగడ్డ 'జాక్' సినిమాతో వినోదం పంచేందుకు వస్తున్నారు. వైష్ణవి చైతన్య, సిద్ధూ జంటగా నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదల కానుంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.
'గుడ్ బ్యాడ్ అగ్లీ'
అజిత్, త్రిష జంటగా నటించిన 'గుడ్ బ్యాడ్ అగ్లీ' ఈనెల 10న థియేటర్స్ లో విడుదల కానుంది. ఇటీవలే మూవీ ట్రైలర్ విడుదల చేయగా.. సూపర్ హిట్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. యాక్షన్ కామెడీ ఎంటర్ టైనర్ నేపథ్యంలో రూపొందిన ఈ మూవీలో అజిత్ విభిన్న పాత్రల్లో అలరించనున్నారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు.
అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి
యాంకర్ ప్రదీప్, దీపికా పిల్లి లేటెస్ట్ మూవీ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ఈనెల 11న విడుదల కానుంది. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా తర్వాత ప్రదీప్ నటిస్తున్న రెండో చిత్రమిది.
బజూక
మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన బజూక ఈ నెల 10న థియేటర్లలోకి రానుంది. ప్రస్తుతం మమ్ముట్టి అనారోగ్య సమస్యల నుంచి కోలుకుంటున్నారు.
పూలే
మహాత్మ జ్యోతిరావు పూలే తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ 'పూలే'. ఈ చిత్రం ఏప్రిల్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.
- టుక్ టుక్: ఈటీవీ విన్ (ఏప్రిల్ 10)
- పెరుసు: నెట్ ఫ్లిక్స్ (ఏప్రిల్ 11)
- ఛోరీ 2: అమెజాన్ (ఏప్రిల్ 11)
- ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ 6: జియో హాట్ స్టార్ (ఏప్రిల్ 11)
- బ్లాక్ మిర్రర్ 7: నెట్ ఫ్లిక్స్ (ఏప్రిల్ 10)
- కోర్టు: ఏప్రిల్ 11( నెట్ ఫ్లిక్స్)
telugu-news | cinema-news | latest news telugu | latest-news this-week-ott-movies