/rtv/media/media_files/2026/02/26/the-kerala-2026-02-26-14-54-23.jpg)
ది కేరళ స్టోరీ2(the kerala story 2) రిలీజ్ పై కేరళ హైకోర్టు(kerala-high-court) సంచలన నిర్ణయం తీసుకుంది. మూవీ రిలీజ్ పై స్టే విధించింది. ఈ సందర్భంగా కోర్టు కీలక కామెంట్స్ చేసింది. సినిమాలో వివాదాస్పద అంశాలున్నాయని పేర్కొంది. అంతేకాకుండా సినిమా చూడకుండానే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చిందని మండిపడింది. CBFC ఈ చిత్రానికి జారీ చేసిన సర్టిఫికేట్ ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన జస్టిస్ బెచు కురియన్ థామస్ బెంచ్, సినిమా విడుదలపై మధ్యంతర స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ సినిమాకు కేవలం 'U/A 16+' సర్టిఫికేట్ ఇవ్వడం వెనుక ఉన్న హేతుబద్ధతను కోర్టు ప్రశ్నించింది. సినిమా కథాంశం, అది సమాజంపై చూపే ప్రభావం దృష్ట్యా ఇంకా కఠినమైన వర్గీకరణ ఎందుకు చేయలేదని న్యాయస్థానం నిలదీసింది. ముఖ్యంగా రాష్ట్రం పేరును టైటిల్‌లో ఉపయోగిస్తూ సామాజిక విద్వేషాలను ప్రేరేపించే విధంగా చిత్రీకరించడంపై ప్రజల్లో ఉన్న ఆందోళనలను పరిగణనలోకి తీసుకోవాలని బెంచ్ అభిప్రాయపడింది.
Also Read : గ్రాండ్‌గా విజయ్-రష్మిక పెళ్లి.. మెనూలో పందికూర!
కేరళకు మాత్రమే పరిమితం కాదని
చిత్ర నిర్మాతలు తమ వాదనను వినిపిస్తూ, ఈ సినిమా కేవలం కేరళకు మాత్రమే పరిమితం కాదని, మూడు రాష్ట్రాలకు సంబంధించిన కథలను ఇందులో చూపించామని తెలిపారు. అందుకే గోస్ బియాండ్ అనే సబ్‌టైటిల్‌ను జోడించినట్లు పేర్కొన్నారు. అయితే, సుమారు 16 కట్లు, సంభాషణల మార్పులు, ఒక సుదీర్ఘమైన డిస్క్లైమర్‌తో బోర్డు ఈ చిత్రాన్ని క్లియర్ చేసినట్లు కోర్టు దృష్టికి వచ్చింది. ప్రస్తుతం ఈ న్యాయపోరాటం కొనసాగుతోంది, తదుపరి విచారణలో తుది తీర్పు వచ్చే అవకాశం ఉంది.
కాగా ఈ చిత్రంలో మొదటి భాగంలో నటించిన అదా శర్మ శాలిని ఉన్నికృష్ణన్ అనే పాత్రలో నటించబోతున్నారు. మొదటి భాగానికి దర్శకత్వం వహించిన సుదీప్తో సేన్ ఈ సీక్వెల్‌ను కూడా తెరకెక్కించారు. విపుల్ అమృత్‌లాల్ షా. సన్‌షైన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి 16 కట్స్ సూచించిన తర్వాత U/A 16+ సర్టిఫికేట్ ఇచ్చింది.
Also Read : ఇట్స్ పూల్ టైమ్.. తడి అందాలతో రెచ్చిపోయిన నేహా శర్మ
Follow Us