/rtv/media/media_files/2025/01/26/CrFIfLBHMDdNULZrGL7i.jpg)
balayya, thaman
Thaman: నందమూరి నటసింహం బాలయ్యను పద్మ భూషణ్ అవార్డు వరించింది. సినీ రంగంలో ఆయన విశేష కృషికి కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డును ప్రకటించింది. ఈ సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి బాలయ్య పై ప్రశంసలు వెలువెత్తుతున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు, చిరంజీవి , రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, నారా లోకేష్ సహా ప్రముఖులంతా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేస్తున్నారు. తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ బాలయ్యను స్వయంగా కలిసి అభినందించారు. ఈ సందర్భంగా ఫొటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.. విత్ మై డియర్ పద్మ భూషణ్ బాలయ్య అంటూ ట్వీట్ చేశారు.
Also Read: Balakrishna: పద్మభూషణ్ అవార్డు స్పందించిన బాలయ్య.. అభిమానుల గురించి చెబుతూ భావోద్వేగం!
With Our Dearest #PadmaBhushanNBK Gaaru #JaiBalayya 🔥💥❤️🔥🦁 pic.twitter.com/82g4IoJvPq
— thaman S (@MusicThaman) January 26, 2025
నందమూరి తమన్
సినిమాల విషయానికి వస్తే తమన్- బాలయ్య కాంబో అంటే ఫ్యాన్స్ కి సెపరేట్ క్రేజ్. వీరిద్దరి కాంబోలో వరుసగా వచ్చిన మూడు సినిమాలు (అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి) బ్లాక్ బస్టర్స్ గా నిలవడంతో పాటు మ్యూజికల్ సెన్షేషన్ క్రియేట్ చేశాయి. దీంతో అభిమానులు తమన్ కాదు నందమూరి తమన్ అంటూ పిలుచుకుంటున్నారు. బాలయ్య సినిమాల్లో తమన్ మ్యూజిక్ వేరే లెవెల్లో ఉంటుంది. మిగతా హీరోల సినిమాలకు సినిమాలకు ఒక రకమైన మ్యూజిక్ ఇచ్చే తమన్ బాలయ్య విషయానికి వస్తే పూనకాలు వచ్చినట్టు ఊగిపోతాడు. స్క్రీన్ పై బాలయ్య కనిపించే ప్రతి ఎలివేషన్ షాట్ బీజీఎమ్ తో దద్దరిల్లిపోతుంది. ఫ్యాన్స్ కూడా థియేటర్స్ లో వీరిద్దరి కాంబోను భలే ఎంజాయ్ చేస్తారు.
Also Read: Balayya Padma Bhushan: జై బాలయ్య.. పద్మ భూషణ్ వేళ అభిమానికి బాలయ్య ఫోన్ కాల్ .. పోస్ట్ వైరల్
Also Read: Balakrishna Padma Bhushan: బాలయ్య బాబుకు అభినందనల వెల్లువ.. ఎవరెవరు విష్ చేశారంటే?