Thalapathy 69 : అదిరిపోయిందిగా... విజయ్ 69 మూవీ టైటిల్ ఫిక్స్!

హీరో విజయ్ నటించనున్న చివరి సినిమాకు టైటిల్ ఫిక్స్ అయింది. జన నాయగన్ టైటిల్ తో మూవీ తెరకెక్కబోతున్నట్లుగా వెల్లడిస్తూ ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో విజయ్ తన అభిమానులతో సెల్ఫీని క్యాప్చర్ చేస్తూ ఉన్నట్లుగా చూపించారు.  

New Update
vijay 69 movie

vijay 69 movie Photograph: (vijay 69 movie )

తమిళ హీరో విజయ్ దళపతి (Thalapathy Vijay) నటించనున్న చివరి సినిమాకు టైటిల్ ఫిక్స్ చేశారు మేకర్స్. రిపబ్లిక్ డే (Republic Day) సందర్భంగా ఈ విషయాన్ని హీరో విజయ్ తన సోషల్ మీడియాలో అధికారికంగా వెల్లడించాడు. జన నాయగన్ టైటిల్ తో మూవీ తెరకెక్కబోతున్నట్లుగా వెల్లడిస్తూ ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.  ఈ పోస్టర్ లో విజయ్ తన అభిమానులతో సెల్ఫీని క్యాప్చర్ చేస్తూ ఉన్నట్లుగా చూపించారు.  అనిల్ రావిపూడి డైరెక్షన్ లో బాలయ్య హీరోగా వచ్చిన భగవంత్ కేసరి సినిమాకు ఇది రీమేక్.  

Also Read :  పెరిగిన చికెన్ ధర.. ఇవాళ కిలో ఎంతంటే?

Also Read :  వీడు గురుమూర్తి కంటే డేంజర్.. ప్రియురాలి మృతదేహాన్ని 8 నెలలు ఫ్రిజ్జులో దాచి

Jana Nayagan - Vijay Thalapathy

హెచ్.వినోత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను  మే నెల ప్రారంభంలో షూటింగ్ ప్రారంభించనున్నారు.  రాక్‌స్టార్ అనిరుధ్ సంగీతం అందించనున్నారు.  2026 పొంగల్‌కు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారని సమాచారం. TVK పార్టీని స్థాపించిన విజయ్ ఓ సందేశాత్మక చిత్రంతో  సినీ కెరీర్ కు ముగింపు పలకాలని చూస్తున్నారు.  బాబీ డియోల్, పూజా హెగ్డే, మమితా బైజు, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రియమణి, ప్రకాష్ రాజ్, నరేన్, తదితరులు ఇతర ముఖ్యపాత్రల్లో నటించనున్నారు. అయితే, నటుడిగా ఎంతో స్టార్ డం తెచ్చుకున్న హీరో విజయ్ పొలిటికల్ గా ఎంత వరకు సక్సెస్ అవుతారనేది వేచి చూడాల్సిందే. ప్పటికే పలు సేవా కార్యక్రమాలతో ప్రజలకు మంచి చేస్తూ వస్తున్నారు విజయ్. స్టూడెంట్స్ కి స్కాలర్‌షిప్ ఇవ్వడం, ఇటీవల వచ్చిన వరద బాధితులకు సహాయం చేయడం వంటి పనులు చేశారు.

Also Read :   ప్రముఖ దర్శకుడు మృతి.. దిగ్భ్రాంతిలో ఇండస్ట్రీ!

Also Read :  మా నాన్న బతికుంటే బాగుండేది.. అజిత్‌ ఎమోషనల్!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Shruti Haasan: నన్ను ఎవరూ ఆనందపరచలేదు.. బ్రేకప్ లిస్ట్ పై శృతి హాసన్ షాకింగ్ కామెంట్స్!

స్టార్ నటి శృతిహాసన్‌ తన ప్రేమకథ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. బ్రేకప్స్ వల్ల చాలా స్ట్రగుల్ అయ్యానని చెప్పింది. ‘ఇతడు ఎన్నో బాయ్‌ఫ్రెండ్‌?’ అని అడుగుతుంటే బాధగా ఉంటుంది. కానీ నా దృష్టిలో బ్రేకప్ కేవలం నంబర్‌ మాత్రమే' అని చెప్పింది. 

New Update
dsruthi

Shruti Haasan interesting comments about love storys

Shruti Haasan: స్టార్ నటి శృతిహాసన్‌ తన ప్రేమ, పెళ్లి గురించి మరోసారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. అంతేకాదు తన పేరెంట్స్ డివోర్స్ కారణంగా తాము ఎదుర్కొన్న అవమానాలను షేర్ చేసుకుంది. ముఖ్యంగా లవ్ స్టోరీస్, బ్రేకప్స్ వల్ల చాలా స్ట్రగుల్ అయ్యానని, తన జీవితంలోకి వచ్చిన వారెవరు ఆనందాన్ని ఇవ్వలేకపోయారని తెలిపింది. 

Also Read :  గిల్ నువ్ సుపరెహే.. సచిన్ కూతురుతో డేటింగ్‌‌పై షాకింగ్ రియాక్షన్.. 3 ఏళ్ళ నుంచి!

ఎన్నో బాయ్‌ఫ్రెండ్‌?

ఈ మేరకు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నటి.. ‘నా లైఫ్ లో అత్యంత బాధపడిన సందర్భం లేదు. నాకెంతో ఇష్టమైన వారిని కూడా బాధపెట్టాను. వారికి జీవితాంతం సారీ చెబుతూనే ఉంటా' అని చెప్పింది. ఇక ప్రతి ఒక్కరికి లవ్ ఫెయిల్యూర్ స్టోరీ ఉంటుందని, తనకు కూడా చాలా బ్రేకప్‌ స్టోరీలున్నాయని చెప్పింది. అయితే బ్రేకప్‌ తర్వాత దాని గురించి ఆలోచించనని, ‘ఇతడు ఎన్నో బాయ్‌ఫ్రెండ్‌?’ అంటూ అడుగుతుంటారని తెలిపింది. కానీ తన దృష్టిలో బ్రేకప్ కేవలం నంబర్‌ మాత్రమేనని చెప్పేసింది. కొన్నిసార్లు ఇతరుల మాటలు బాధపెడుతుంటాయని, తాను కూడా మనిషినేనని చెప్పింది.

Also Read :  భారత్,పాక్ సరిహద్దుల్లో హై టెన్షన్.. అధికారులతో రాజ్‌నాథ్‌ సింగ్‌ ఎమర్జెన్సీ మీటింగ్!

ఇక ‘గబ్బర్‌సింగ్‌’ సినిమా తన కెరీర్ కు బూస్ట్ ఇచ్చిందని, అంతకుముందు తనను ఐరన్ లెగ్ అంటూ ట్రోలింగ్ చేశారని వాపోయింది. ఫెయిల్ అయిన సినిమాల్లో హీరోను కాకుండా కేవలం తనను మాత్రమే టార్గెట్ చేయడం బాధకరమని చెప్పింది. ‘గబ్బర్‌సింగ్‌’ తర్వాతే నా కెరీర్ ఊపందుకుంది. అయినా నేను నాకు నచ్చిన సినిమాల్లోనే నటించాలనుకుంటున్నా అంటూ చెప్పుకొచ్చింది. 

Also Read :  చెలరేగిపోయిన రికిల్టన్, సూర్య.. లక్నో ముందు భారీ టార్గెట్

Also Read :  గిల్ నువ్ సుపరెహే.. సచిన్ కూతురుతో డేటింగ్‌‌పై షాకింగ్ రియాక్షన్.. 3 ఏళ్ళ నుంచి!

sruthihasan | love | breakup | telugu-news | today telugu news

Advertisment
Advertisment
Advertisment