/rtv/media/media_files/2025/03/01/jKLToBt7bVSQdcX6t1Hq.jpg)
telangana high court sensational orders over benifit and special cinema shows
తెలంగాణలో బెనిఫిట్ షోలు, ప్రీమియర్స్, స్పెషల్ షోలపై హైకోర్టు మరోసారి తీర్పు వెలువరించింది. ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేసింది. థియేటర్లలో స్పెషల్ షోలకు అనుమతి నిరాకరించింది. బెనిఫిట్, ప్రీమియర్స్‌ను అనుమతి లేదని మరోసారి స్పష్టం చేసింది. ఇందులో భాగంగా ఇప్పటికే జనవరి 21న జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు మరోసారి సవరించింది.
Also Read: హిందూ అమ్మాయితో పెళ్లి.. ముస్లిం వ్యక్తిని చితకబాదిన లాయర్లు!
పిల్లలకు అనుమతి
ఈ మేరకు ప్రీమియర్, బెనిఫిట్ షోలపై నిషేధాన్ని స్పష్టం చేసింది. గతంలో 16 ఏళ్ల లోపు పిల్లలను అర్థరాత్రి నుంచి ఉదయం షోల వరకు అనుమతించ రాదని హైకోర్టు తెలిపింది. అయితే తాజాగా సవరించిన ఉత్తర్వుల ప్రకారం.. 16 ఏళ్ల లోపు పిల్లల్ని అన్ని షోలకు అనుమతించాలని అందులో పేర్కొంది.
Also Read: ఈశా ఫౌండేషన్‌కు బిగ్ రిలీఫ్.. సుప్రీంకోర్టు కీలక ఆదేశం
ఇందులో భాగంగా హైకోర్టు ఇప్పటికే ప్రభుత్వానికి కొన్ని ఆదేశాలు జారీ చేసింది. థియేటర్లలో షోలు ప్రదర్శించడంలో సినిమాటోగ్రఫీ చట్టాన్ని పాటించాలని ప్రభుత్వానికి తెలిపింది. అంతేకాకుండా ఈ సినిమాటోగ్రఫీ చట్టం ప్రకారం.. అర్థరాత్రి 1.30 గంటల నుంచి ఉదయం 8.40 గంటల మధ్య థియేటర్లలో ఎలాంటి షోలకు అనుమతి ఇవ్వొద్దని ప్రభుత్వా్న్ని ఆదేశించింది.
Also Read: HYD: పుప్పాలగూడలో అగ్నిప్రమాదం..పాపతో సహా ముగ్గురు మృతి
ఈ మేరకు ప్రేక్షకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని బెనిఫిట్, ప్రీమియర్ షోలకు అనుమతించోద్దని సూచించింది.
అంతేకాకుండా నిర్మాత ఎక్కువ డబ్బులు పెట్టి సినిమా తీసి.. వాటిని ప్రేక్షకుల నుంచి వసూలు చేయడం మంచి పద్దతి కాదని వ్యాఖ్యానించింది. ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణను మార్చి 17కు వాయిదా వేసింది.
ఏం జరిగింది?
గతంలో పుష్ప2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన సంఘటనతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇకపై బెనిఫిట్, ప్రీమియర్ షోలు ఉండవని చెప్పింది. అంతేకాకుండా టికెట్ రేట్ల పెంపునకు కూడా అనుమతి నిరాకరించింది. కానీ రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ సినిమా టికెట్ రేట్ల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అనంతరం ఈ విషయంపై సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు తాజాగా ఈ ఉత్తర్వులు జారీ చేసింది.