/rtv/media/media_files/2025/02/23/YNd24vkHh9SgSt0wbhez.jpg)
SSMB29 Movie Updates Photograph: (SSMB29 Movie Updates)
SSMB29: దర్శకుడు రాజమౌళి 'బాహుబలి' సినిమాతో ఒకే కథను రెండు భాగాలుగా చెప్పే ట్రెండ్ ప్రారంభించారు. అయితే ఇప్పుడు మహేష్ బాబు 'SSMB 29' కూడా అదే ఫార్మాట్ లో ఉండబోతున్నట్లు పుకార్లు వస్తున్నాయి. ఈ సినిమా కూడా జక్కన్న రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్లు గత కొన్నిరోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఒకే పార్ట్ లో
అయితే తాజా నివేదికల ప్రకారం.. రాజమౌళి ఈ పుకార్లను తోసిపుచ్చినట్లు తెలుస్తోంది. రెండు భాగాలుగా కాకుండా 'SSMB 29' కథను ఒకే పార్ట్ లో చెప్పాలని అనుకుంటున్నారట. అయితే చాలా మంది చిత్రనిర్మాతలు అనవసరంగా.. ఆర్ధిక లాభం కోసం కంటెంట్‌ను సాగదీస్తున్నారనే ఉద్దేశంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 'SSMB 29' లాంటి గ్రాండ్ స్కెల్ చిత్రాన్ని ఒకే పార్ట్ లో అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారట రాజమౌళి. RRR మాదిరిగానే ఇది కూడా 3 గంటల 30 నిమిషాల రన్‌టైమ్ కలిగి ఉంటుందని టాక్.
#SSMB29 is a PROPER ONE PART FILM and the ANNOUNCEMENT is EXPECTED SOON 💥💥💥@urstrulyMahesh - The Price of Telugu Box-Office is coming 🦁 pic.twitter.com/By0uQOLAbk
— CineHub (@Its_CineHub) April 3, 2025
ఇదిలా ఉంటే 'ssmb29' కోసం మహేష్, రాజమౌళి టీమ్ తెగ కష్టపడుతున్నారు. ప్రస్తుతం ఒడిస్సాలోని కోరాపుట్ జిల్లాలో ఈ సినిమా తాజా షెడ్యూల్ ఏర్పాటు చేసినట్లు సమాచారం. దీని కోసమే మహేశ్ బాబు హైదరాబాద్ నుంచి ఒడిస్సా బయలుదేరిన వీడియోలు ఇటీవలే తెగ వైరల్ అయ్యాయి. ఇక ఈమూవీలో మహేష్ బాబు సరసన బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తోంది. హాలీవుడ్ ఫిల్మ్ 'ఇండియానా జోన్స్ సిరీస్’ను పోలి ఉండేలా రాజమౌళి ఈ చిత్రాన్ని రూపొందించనున్నట్లు తెలుస్తోంది.
cinema-news | latest news telugu | Mahesh Babu SSMB 29 | rajamouli
Also Read: Viral News: తల్లికి, బిడ్డకు ఒకేసారి కడుపు చేసిన యూట్యూబర్.. నెట్టింట ఫొటోస్ షేర్ చేయడంతో రచ్చ రచ్చ!