/rtv/media/media_files/2025/02/20/ToDsg76AYxhtf8XvC7Vc.jpg)
Sreeleela eating palli podi
Sreeleela Video: యంగ్ శ్రీలీల ఓ వైపు వరుస సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ లేటెస్ట్ ఫొటోలు, వీడియోలతో సందడి చేస్తుంటుంది. అయితే తాజాగా శ్రీలీల షేర్ చేసిన ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇందులో శ్రీలీల కారం పొడితో అన్నం తింటూ కనిపించింది. పల్లీ పొడి, వేడన్నం బెస్ట్ కాంబో అంటూ ఫుడ్ ని ఎంజాయ్ చేస్తూ తినింది. ఇది తినడం కోసం ఉదయం నుంచి ఏమీ తినకుండా వెయిట్ చేసినట్లు తెలిపింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు సో క్యూట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
చద్దన్నం లో గొడ్డు కారం కలుపుకొని తింటున్న నటి శ్రీలీల.. #Sreeleela #viralvideo #tollywoodactress #RTV pic.twitter.com/MeF6czfOsp
— RTV (@RTVnewsnetwork) February 20, 2025
ఇక శ్రీలీల సినిమాల విషయానికి వస్తే .. ప్రస్తుతం నితిన్ సరసన 'రాబిన్ హుడ్' సినిమా చేస్తోంది. వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే ఈ సినిమా నుంచి విడుదలైన 'Wherever You Go' లిరికల్ వీడియో సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. వినూత్నంగా బ్రాండ్ పేర్లతో రచించిన ఈపాట ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. 5 రోజుల్లోనే 5 మిలియన్ వ్యూస్ తో ట్రెండింగ్ లో ఉంది. ఇందులో శ్రీలీల, నితిన్ డాన్స్ మూవ్స్ చాలా కూల్ గా ఉన్నాయి. దీంతో పాటు పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ లో కూడా నటిస్తోంది.
బాలీవుడ్ ఎంట్రీ
ఓ వైపు తెలుగు సినిమాలు చేస్తూనే మరో వైపు బాలీవుడ్ ఎంట్రీకి కూడా సిద్ధమైంది శ్రీలీల. తాజాగా హిందీలో శ్రీలీల నటిస్తున్న ఫస్ట్ ఫిల్మ్ టీజర్ రిలీజ్ చేశారు. కార్తిక్ ఆర్యన్ సరసన రొమాంటిక్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే సినిమా టైటిల్ ఏంటి? అనేది ఇంకా రివీల్ చేయలేదు. అనురాగ్ బసు తెరకెక్కిస్తున్న ఈ చిత్రం దీపావళి కానుకగా విడుదల కానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.