/rtv/media/media_files/2025/03/17/WG5wNORBnvid8yORBMWu.jpg)
sourav ganguly only being part of khakee the bengal chapter promotions
భారత మాజీ క్రికెటర్ సౌరభ్ గంగూలీ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడంటూ గత కొద్ది రోజులుగా నెట్టింటా ప్రచారం జరుగుతోంది. ‘ఖాకీ: ది బెంగాల్ చాప్టర్’ (ఖాకీ 2)లో గంగూలీ గెస్ట్ రోల్‌లో నటిస్తున్నాడంటూ కొన్ని ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో చాలా మంది అభిమానులు తమ అభిమాన క్రికెటర్.. ఇప్పుడు సినిమాల్లోకి వస్తున్నాడని తెలిసి తెగ మురిసిపోతున్నారు.
Also Read: ఆమె ప్రతి అంగంలో బంగారమే.. రన్యారావుపై బీజేపీ MLA వల్గర్ కామెంట్స్!
Sourav Ganguly
ఈ నేపథ్యంలో ఆ వార్తలపై ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ పార్మ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు రానుంది. మార్చి 20 నుంచి ప్రేక్షకులను అలరించనుంది. ఈ నేపథ్యంలో నెట్‌ఫ్లిక్స్ ఓ వీడియో షేర్ చేసింది. ‘ది బెంగాల్ టైగర్ మీట్స్ బెంగాల్ ఛాప్టర్’ అంటూ ఆ వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది.
Also Read : అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణవాసుల మృతి..
ఆ వీడియోలో గంగూలీ పోలీస్ ఆఫీసర్ డ్రెస్‌లో కనిపించాడు. అందులో హీరో చేయాల్సిన పనులన్నీ దర్శకుడు గంగూలీకి చెప్తాడు. దీంతో ఇవన్నీ చేయడం తనవల్ల కాదని గంగూలీ అనడం చూడవచ్చు. ఆపై దర్శకుడు.. మీరు మార్కెటింగ్ చేయండని అనడంతో గంగూలీ ఓకే అంటాడు. దీని బట్టి చూస్తే మాజీ క్రెకెటర్ గంగూలీ ఈ సిరీస్ (Khakee: The Bengal Chapter) ప్రమోషన్స్‌లో మాత్రమే భాగమయ్యారని అర్థమవుతోంది.
The Bengal Tiger meets the Bengal Chapter 👀🐯
— Netflix India (@NetflixIndia) March 17, 2025
Watch Khakee: The Bengal Chapter out 20 March, only on Netflix.#KhakeeTheBengalChapterOnNetflix pic.twitter.com/wawwa5oq58
Also Read: కుల వివక్షపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు
ఏది ఏమైనా ఈ ప్రమోషనల్ వీడియోలో తమ అభిమాన క్రికెటర్‌ను ఖాకీ డ్రెస్‌లో చూసి అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇదిలా ఉంటే.. గతంలో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ‘ఖాకీ ది బిహార్ చాప్టర్’కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా ఈ ప్రాజెక్ట్ సిద్ధమైంది. మరోవైపు సౌరభ్ గంగూలీ లైఫ్‌స్టోరీ త్వరలో వెండితెర పైకి రానున్న విషయం తెలిసిందే.
Also Read : విజయశాంతిని అలాగే పిలుస్తా.. అంతగా దగ్గరయ్యాం: కల్యాణ్‌రామ్ సంచలనం!