Soundarya - Mohan Babu: ప్రాపర్టీ ఇష్యూ.. మోహన్‌బాబుపై సౌందర్య భర్త సంచలన వ్యాఖ్యలు..!

సౌందర్య-మోహన్ బాబు ప్రాపర్టీ ఇష్యూ వైరల్‌గా మారింది. దీనిపై సౌందర్య భర్త రఘ స్పందించారు. ప్రాపర్టీ విషయంలో తన భార్య, మోహన్‌బాబు పేర్లను అనవసరంగా ప్రస్తావిస్తున్నారని అన్నారు. ఇవన్నీ అవాస్తవాలని.. ఆధారాలు లేని వార్తలే అని తెలిపారు.

New Update
Soundarya Husband Raghu Sensational Comments On Mohan Babu About Property Issues

Soundarya Husband Raghu Sensational Comments On Mohan Babu About Property Issues Photograph: (Soundarya Husband Raghu Sensational Comments On Mohan Babu About Property Issues)

గత కొద్ది రోజులుగా మోహన్ -బాబు పేరు మారు మోగిపోతుంది. నటి సౌందర్యది ప్రమాదం కాదని.. మోహన్ బాబే హత్య చేయించి ఉంటారని ఖమ్మం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఆరోపణలు చేశాడు. ఈ మేరకు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. జల్పల్లికి చెందిన ఫామ్‌హౌన్‌ను మోహన్‌ బాబు స్వంతం చేసుకుని దానిని అనుభవిస్తున్నట్లు ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆయన వ్యాఖ్యలు నెట్టింట సంచలనంగా మారాయి. 

Also Read: రన్యా రావు గోల్డ్ స్మగ్లింగ్‌ కేసులో బిగ్ ట్విస్ట్ .. ప్రోటోకాల్‌ దుర్వినియోగం వెనుక సవితి తండ్రి

సౌందర్య భర్త కీలక వ్యాఖ్యలు

ఈ వ్యాఖ్యలపై సౌందర్య భర్త రఘు తాజాగా రియాక్ట్ అయ్యారు. హైదరాబాద్‌లోని ఒక ప్రాపర్టీ విషయంలో గత కొద్ది రోజుల నుంచి తన భార్య సౌందర్య, మోహన్‌బాబు పేర్లను అనవసరంగా ప్రస్తావిస్తున్నారని ఆయన అన్నారు. ప్రాపర్టీ విషయంలో ఇవన్నీ అవాస్తవాలని.. ఆధారాలు లేని వార్తలే అని తెలిపారు. తన భార్యకు చెందిన ఎలాంటి ఆస్తులను మోహన్‌ బాబు ఇల్లీగల్‌గా స్వాధీనం చేసుకోలేదని పేర్కొన్నారు. 

Also Read: రెచ్చిపోయిన పోలీసులు.. రచ్చ చేశారంటూ యువతకు గుండ్లు కొట్టించి ఊరేగింపు

తనకు తెలిసినంత వరకు మోహన్ బాబుకు, తమకు ఎలాంటి ఆస్తి లావాదేవీలు లేవని చెప్పుకొచ్చారు. ఇక సౌందర్య మరణించిన తర్వాత తనకు మోహన్‌బాబుతో 25 ఏళ్లకు పైగా మంచి స్నేహం ఉందని తెలిపారు.

Also Read: గోల్డ్ స్మగ్లింగ్ కేసులో బిగ్ ట్విస్ట్...రన్యారావు వెనుక ప్రముఖులు., పెళ్లి వీడియో పై సీబీఐ కన్ను!

ఈ విషయంలో తాను మోహన్ బాబుకే అండగా నిలుస్తున్నానని.. అసలు విషయం ఏంటో అందరికీ చెప్పాలనుకుంటున్నానని అన్నారు. తమకు మోహన్ బాబుకు ఎలాంటి ఆస్తి లావాదేవీలు జరగలేదని అన్నారు. ఇవి ముమ్మాటికి ఆధారాల్లేని వార్తలే అని కొట్టిపారేసాడు. దయచేసి ఇలాంటి తప్పుడు వార్తలను స్ప్రెడ్ చేయకండి అంటూ ఆయన ఓ నోట్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం అది వైరల్‌గా మారింది.

Also Read: ఏపీలో ఎండలు,వేడిగాలులు...ఈ జిల్లాలకు వాతావరణశాఖ హెచ్చరికలు!

మోహన్ బాబుపై ఫిర్యాదు

సినీనటి సౌందర్యది హత్యేనని.. చంపించింది మోహన్ బాబేనని ఖమ్మం జిల్లా సత్యనారాయణపురం గ్రామం ఏదులాపురం గ్రామపౌచాయతీకి చెందిన ఎదురుగట్ల చిట్టిమళ్లు అనే వ్యక్తి ఖమ్మం కలెక్టర్‌కు, ఖమ్మం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సినీనటి సౌందర్యది ప్రమాదవశాత్తు సంభవించిన మృతి కాదని పక్కా హత్యేనని ఫిర్యాలో పేర్కొన్నాడు. సౌందర్య హత్య వెనుక సినీనటుడు మంచు మోహన్ బాబే కారణమంటూ ఫిర్యాదులో ఆరోపించాడు.

హైదరాబాద్ శివారులోని జల్ పల్లి ఫాంహౌజ్ ను సొంతం చేసుకునేందుకే మోహన్ బాబు.. సౌందర్యను, ఆమె సోదరుడు అమర్నాథ్ ను పథకం ప్రకారం హత్య చేశాడని అందులో తెలిపాడు. సౌందర్య ఆత్మకు శాంతికలగాలంటే జల్ పల్లి ఫాంహౌజ్ ను మోహన్ బాబు నుంచి స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వాన్ని కోరాడు. సౌందర్య మృతిపై రీఎంక్వైరీ వేయాలని.. అదే క్రమంలో మంచు మనోజ్ కు సైతం న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశాడు. ఈ మేరకు డిమాండ్ల సాధన కోసం నిరాహార దీక్ష చేపట్టాడు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు