/rtv/media/media_files/2025/03/22/pEIwNFg4hAclzDjFBmu5.jpg)
Sobhita copied Samantha
ఇటీవలే 'వోగ్' మ్యాగజైన్ కవర్ పేజ్ కోసం నాగచైతన్య, శోభిత చేసిన ఫోటో షూట్ లో శోభిత ధరించిన డ్రెస్ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. శోభిత సమంత స్టైల్ ని కాపీ కొట్టిందంటూ నెటిజన్లు ట్రోలింగ్ మొదలు పెట్టారు. అయితే శోభిత ఈ షూట్ కోసం అఖ్ల్ బ్రాండ్ కి చెందిన సిల్వర్ కలర్ టాసెల్-డిటెయిలింగ్ స్లిప్ డ్రెస్ ధరించింది. దీని ధర దాదాపు రూ. 49,593 పైగా ఉంటుంది. కాగా, ఇది గతంలో సమంత ధరించిన ఓం బ్రే-హ్యూడ్ టాసెల్డ్ స్కర్ట్ ని పోలి ఉంది. దీంతో నెటిజన్లు శోభిత.. సమంత స్టైల్ ని కాపీ చేసిందంటూ కామెంట్లు చేస్తున్నారు. ''మీరు సమంత దుస్తులను కూడా కాపీ చేసారు" అంటూ వ్యాఖ్యానించాడు ఓ నెటిజన్.
Also Read : ఏపీ ప్రజలకు చల్లని కబురు.. ఈ జిల్లాల్లో నాలుగు రోజులు వానలే..వానలు!
#SobhitaDhulipala trolled for ‘copying’ #Samantha’s dress in Vogue shoot with #NagaChaitanya! 📸✨
— PJ Explained 𝕏 (@PJExplained07) March 22, 2025
Fans say it’s a rip-off, but it’s Akhl vs. Studio Moon Ray—totally different! Haters gonna hate, love wins 💖 pic.twitter.com/yV82nvitBU
2021లో విడాకులు
ఇది ఇలా ఉంటే 'ఏ మాయ చేసావే' సినిమాతో ప్రేమలో పడ్డ సమంత- నాగచైతన్య ఐదు సంవత్సరాల డేటింగ్ తర్వాత 2017లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత 2021లో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. ఈ జంట విడిపోయి ఐదేళ్లు గడిచినప్పటికీ.. తరచూ వీరిద్దరిని ముడిపెడుతూ ఏదొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది.
Also Read : లడక్ లో చైనా కౌంటీలు..ఆగ్రహం వ్యక్తం చేసిన భారత్
Also Read : 2700 మంది పోలీసులు.. 450 సీసీ కెమెరాలు..ఐపీఎల్ మ్యాచ్ ల సెక్యూరిటీ
naga-chaitanya | latest-telugu-news | today-news-in-telugu | telugu-cinema-news | telugu-film-news