/rtv/media/media_files/2025/03/05/13VXfqQ2bp236aGCyYkO.jpeg)
singer kalpana Photograph: (singer kalpana )
ప్రముఖ సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. మంగళవారం ఆమె నివాసంలో నిద్రమాత్రలు మింగి సూసైడ్ అట్మెంట్ చేశారు. వెంటనే ఆమెను నిజాం పేట్‌లోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఐసీయూలో వెంటిలేటర్‌పై ఆమెకు చికిత్స అందిస్తున్నారు. కల్పన ఆత్మహత్నానికి గల కారణాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆమె భర్త ప్రసాద్‌ను పోలీసులు విచారిస్తున్నారు. రెండు రోజులుగా తాను ఇంట్లో లేనని భర్త ప్రసాద్ చెబుతున్నారు. పోలీసులు కల్పన, ఆమె భర్త ప్రసాద్ ఫోన్లను హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. సింగర్ కల్పన ప్రసాద్‌ను రెండో వివాహం చేసుకున్నారు.
సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం ..
— Sravani Journalist (@sravanijourno) March 4, 2025
హాస్పటల్ లో చికిత్స పొందుతున్న కల్పన..
భర్త ప్రసాద్ ను హాస్పిటల్ నుండి kphb పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్న దృశ్యం..! pic.twitter.com/IPJOm6d1YD
Also read : posani: దెబ్బ మీద దెబ్బ.. పోసానికి మరో కేసులో 14 రోజులు రిమాండ్
రెండు రోజులుగా బయటకు రాకుండా ఇంట్లోనే ఉన్న కల్పన మంగళవారం ఓవర్ డేస్ నిద్రమాత్రలు తీసుకున్నారు. ఫోన్ చేసిన ఆన్సర్ చేయడం లేదని, సీసీ కెమెరాలో పరిశీలించి భర్త ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంటికి వెళ్లి చూడగా.. కల్పన అపస్మారక స్థితిలో కనిపించారు. కల్పనను చూసేందుకు ఆమె భర్త చెన్నై నుంచి హాస్పిటల్‌కు చేరుకున్నారు. వారి మధ్య ఎలాంటి వివాదాలు లేవని.. సంతోషంగా ఉంటున్నామని పోలీసులకు తెలిపారు. కావాలనే నిద్రమాత్రలు అధికంగా తీసుకున్నారా? లేక అనుకోకుండా ఓవర్ డోస్ అయ్యిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంటి పక్కవారు కల్పన బయటకు రావడం లేదని చెప్పడానికి ఆమె భర్తకు ఫోన్ చేశారు. ఆ సమయంలో ఆయన ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సింగర్ సునీతా, శ్రీకృష్ణాలతోపాటు ఆమె అభిమానులు హాస్పిటల్‌కు చేరుకున్నారు.