/rtv/media/media_files/2025/02/17/aFqPJjNl7Y1U4z1h3Bcz.jpg)
Shweta Basu
నటి శ్వేతా బసు ప్రసాద్ (Shweta Basu Prasad) 2008లో కొత్త బంగారు లోకం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సినిమాలో శ్వేతా నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత తెలుగులో వరుస సినిమాలు చేసింది. రైడ్, కాస్కో, కలవర్ కింగ్, ప్రియుడు, జీనియస్ వంటి అనేక చిత్రాల్లో నటించింది. హిందీ , తమిళ్లో కూడా సినిమాలు చేసింది. చివరిగా 2022లో 'ఇండియన్ లాక్ డౌన్' అనే సీరీస్ లో కనిపించింది.
Also Read: Chhaava Day 2 Collections: రెండు రోజుల్లోనే 100 కోట్ల దిశగా.. 'చావా' బాక్సాఫీస్ సంచలనం
తెలుగు సెట్ లో ఎగతాళి
అయితే తాజాగా బాలీవుడ్ బబుల్ అనే ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్వేతా తెలుగు సినిమా (Telugu Cinema) సెట్ లో తనకు జరిగిన చేదు అనుభవాన్ని పంచుకుంది. తన హైట్ కారణంగా వేధింపులకు గురైనట్లు తెలిపింది. శ్వేతా మాట్లాడుతూ.. ఓ తెలుగు సినిమా చిత్రీకరణ సమయంలో మూవీ యూనిట్ అంతా ప్రతిరోజూ నా ఎత్తును గుర్తు చేసేవారు. ఎందుకంటే హీరో నా కంటే చాలా పొడవుగా ఉండేవాడు. దీంతో ప్రతి సీన్ మార్చేసేవాడు. రీటేక్‌లు ఇచ్చేవాడు. నాకు నియంత్రణ లేని ఒక దాని గురించి( హైట్) నన్ను పదేపదే అనేవారు. అది జన్యుపరమైనది.. దానిని మేనేజ్ చేయలేము. నన్ను నిజంగా వేధించిన ఏకైక సెట్ అదే అంటూ తన అనుభవాన్ని పంచుకుంది.
Also Read: Prabhas Salaar: ఇదిరా రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్.. 366 రోజులు ట్రెండింగ్‌లోనే ‘సలార్’
Also Read : అప్పులే కారణమా? .. ఫ్యామిలీ మొత్తం సూసైడ్.. ముందుగా విషం ఇచ్చి..
శ్వేతా ప్రస్తుతం టీవీ షోలలో సందడి చేస్తూ బిజీగా ఉంది. 11 సంవత్సరాల వయసులో తన నటనా జీవితాన్ని ప్రారంభించిన శ్వేతా 'మక్దీ ' అనే చిత్రంతో బాలనటిగా అవార్డును గెలుచుకుంది. ఆ గుర్తింపుతో టెలివిజన్ సీరీస్, సినిమాల్లో అవకాశాలు సంపాదించుకుంది. 2005లో ఇక్బాల్ చిత్రంలో ఖదీజా పాత్రకు ఉత్తమ సహాయ నటిగా 5వ కరాచీ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం అవార్డును గెలుచుకుంది.