Subham Teaser: స్టార్ హీరోయిన్ సమంత ఓ వైపు సినిమాల్లో రాణిస్తూనే మరోవైపు ప్రొడక్షన్ రంగంలోనూ సత్తా చాటేందుకు సిద్ధమైంది. తాజాగా ఆమె సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై రూపొందిన తొలి సినిమా శుభం టీజర్ విడుదల చేశారు. భార్య భర్తలిద్దరూ శోభనం గదిలో కూర్చొని మాట్లాడకుంటున్న సీన్ తో మొదలైన టీజర్.. ప్రేక్షకులను నవ్విస్తూ, భయపెడుతూ, థ్రిల్లింగ్ సన్నివేశాలతో వినోదాత్మకంగా సాగింది. పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా సినిమా ఉండబోతున్నట్లు టీజర్ చూస్తుంటే అర్థమవుతోంది. ముగ్గురు మహిళలు టీవీవైపు చూస్తూ, ''చచ్చినా చూడాల్సిందే'' అనే ట్యాగ్ లైన్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
Also Read: Actress Abhinaya: హీరో కాదు బిజినెస్ మ్యాన్.. కాబోయే భర్తను పరిచయం చేసిన అభినయ!
Also Read: Actress Abhinaya: హీరో కాదు బిజినెస్ మ్యాన్.. కాబోయే భర్తను పరిచయం చేసిన అభినయ!
సమ్మర్ రిలీజ్
'సినిమా బండి' ఫేమ్ ప్రవీణ్ కండ్రెగుల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, శ్రియా కొంతం, శ్రావణి లక్ష్మి, షాలిని కొండెపూడి, వంశీధర్ గౌడ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. క్లింటన్ సెరెజో సంగీతం అందించగా.. వివేక్ సాగర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సమకూర్చారు. వేసవిలో ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ . త్వరలోనే రిలీజ్ కూడా అనౌన్స్ చేయనున్నారు. వసంత్ మారింగంటి కథను అందించారు. మద్రుల్ సుజిత్ సేన్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. సమంత 2023లో 'ట్రలాలా మూవింగ్ పిక్చర్స్' ప్రారంభించారు. ఈ తరం ఆలోచనలను, వ్యక్తీకరణను సూచించే కంటెంట్‌ను రూపొందించాలనే లక్ష్యంతో దీనిని స్టార్ట్ చేశారు.
telugu-news | cinema-news | latest-news | Subham Official Teaser Tralala Moving Pictures
Also Read: Janhvi Kapoor: సూట్ విప్పి.. ర్యాంప్ పై అదరగొట్టిన జాన్వీ.. నడుస్తుంటే మామూలుగా లేదుగా! వీడియో వైరల్