Sikandar Teaser: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'సికందర్'. AR మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ హై యాక్షన్ ఎంటర్ టైనర్ ఈద్ కానుకగా థియేటర్స్ లో విడుదల కానుంది. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన కథానాయికగా నటిస్తోంది. ప్రముఖ నిర్మాత సాజిద్ నడియాడ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారీ అంచనాలతో రూపొందుతున్న 'సికందర్' కోసం సల్మాన్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మేకర్స్ మూవీ టీజర్ రిలీజ్ చేశారు.
Also Read: Shruti Hasan: శృతి హాసన్ హాలీవుడ్ ఎంట్రీ.. 'The Eye' ట్రైలర్ చూశారా?
Jo dilon par karta hai raj woh aaj kehlata hai Sikandar
— Salman Khan (@BeingSalmanKhan) February 27, 2025
https://t.co/Bn5NdtKN2z #SajidNadiadwala’s #Sikandar
Directed by @ARMurugadoss
@iamRashmika #Sathyaraj @TheSharmanJoshi @MsKajalAggarwal @prateikbabbar #AnjiniDhawan @jatinsarna #AyanKhan @DOP_Tirru…
సికందర్ టీజర్
అమ్మమ్మ అతనికి సికందర్ అని పేరు పెట్టింది, తాతయ్య సంజయ్ అని పేరు పెట్టాడు, జనాలు అతనికి రాజా సాహెబ్ అని పేరు పెట్టారు అంటూ సల్మాన్ డైలాగ్ తో టీజర్ మొదలవుతుంది. సల్లు భాయ్ యాక్షన్ సన్నివేశాలు, పవర్ ఫుల్ డైలాగ్స్, మధ్య మధ్యలో రష్మిక లవ్ స్టోరీతో టీజర్ ఆసక్తికరంగా సాగింది. ముఖ్యంగా సల్మాన్ హై యాక్షన్ సీన్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.
Also Read: Lucky Baskhar: ఇదేం క్రేజ్ రా బాబు.. 'లక్కీ భాస్కర్' ఎక్కడ వదలట్లేదు.. నెట్ ఫ్లిక్స్ లో మరో రికార్డు